Breaking News

అమ్మకు బదులు అమ్మాయి 

Published on Thu, 12/11/2025 - 05:04

ఓస్లో: వెనెజులాలో ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సాహసి, ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో.. ఆ నిప్పుకణిక లేకుండానే.. నోబెల్‌ శాంతి బహుమతి ప్రదానోత్సవం బుధవారం ఓస్లోలో జరిగింది. భయంకరమైన పరిస్థితుల నడుమ రాలేకపోయినప్పటికీ, ఆమె కూతురు అనా కొరినా సోసా.. వేదికపై తల్లి తరపున ఆ చారిత్రక గౌరవాన్ని స్వీకరించారు. మచాడో ఈ ఏడాది జనవరి 9 నుండి అజ్ఞాతంలో ఉన్నారు. అదేరోజు, ఆమె వెనెజులా రాజధాని కారకాస్‌లో తన మద్దతుదారులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. 

త్వరలో మనతో మారియా.. 
నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ చైర్, జోర్జెన్‌ వాట్నే ఫ్రైడ్నెస్‌ సభలో చేసిన వ్యాఖ్యలు ఆహూతులను కదిలించాయి. ‘మారియా కొరినా మచాడో ఈ రోజు వేడుకకు హాజరయ్యేందుకు తన శక్తి మేరకు ప్రయతి్నంచారు. ఆమె రాలేకపోయినా, సురక్షితంగా ఉన్నారని ధ్రువీకరించడానికి ఎంతో సంతోíÙస్తున్నాం. ఆమె త్వరలోనే ఓస్లోలో మనతో ఉంటారు’.. అని ప్రకటించగానే సభ చప్పట్లతో దద్దరిల్లింది. ముందుగా నోబెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్, మచాడో ప్రతినిధి ఆమె రాలేకపోతున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా మచాడో కుమార్తె అనా కొరినా సోసా.. తన తల్లి స్థానాన్ని అలంకరించారు. 

ఈ బహుమతి వెనెజులా ప్రజలందరిది 
నోబెల్‌ వెబ్‌సైట్‌లో విడుదలైన మచాడో ప్రసంగం ఆద్యంతం ఉద్వేగాన్ని నింపింది. ‘నేను ఓస్లో చేరుకోవడానికి ఎందరో ప్రాణాలను పణంగా పెట్టారు. వారికి నేను కృతజ్ఞురాలిని. ఈ గుర్తింపు వెనెజులా ప్రజలకు ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది’.. అన్న ఆమె గొంతులో పోరాట స్ఫూర్తి ప్రతిధ్వనించింది. ‘ఈ బహుమతి మొత్తం వెనెజులా ప్రజలందరిది. నేను రాగానే, రెండేళ్లుగా చూడని నా కుటుంబ సభ్యులను, నా పిల్లలను కౌగిలించుకుంటాను’.. అని ఉద్వేగంతో ఆమె చెప్పారు. 

ఐదుగురూ నిర్బంధంలోనే.. 
గతంలో కూడా ఐదుగురు నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీతలు (నర్గెస్‌ మొహమ్మది–2023, అలెస్‌ బియాలియాట్సి్క–2022, లియు జియాబో–2010, ఆంగ్‌ సాన్‌ సూ కీ–1991, కార్ల్‌ వాన్‌ ఒసియెట్జీ్క–1935) నోబెల్‌ అవార్డు ప్రకటించే సమయానికి జైలులో లేదా నిర్బంధంలో ఉండటం గమనార్హం. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)