Breaking News

దేనికైనా రెడీ.. ట్రంప్‌కు క్యూబా అదిరిపోయే కౌంటర్‌

Published on Mon, 01/12/2026 - 07:52

హవానా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్యూబాకు హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా నుంచి చమురు కానీ, నిధులు కానీ కావాలంటే తమతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌నకు క్యూబా కౌంటరిచ్చింది. నిబంధనలను నిర్దేశించే నైతిక అధికారం అమెరికాకు లేదంటూ ఘాటుగా స్పందించింది.

అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికలపై క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో క్యూబా ఒక స్వేచ్ఛాయుతమైన, స్వతంత్ర, సార్వభౌమ దేశం. మేము ఏం చేయాలో ఎవరూ నిర్దేశించాల్సిన అవసరం లేదు. క్యూబా ఎప్పుడూ సంఘర్షణను కోరుకోదు. చివరి రక్తపు బొట్టు వరకు మాతృభూమిని రక్షించడానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు క్యూబా సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.

మరోవైపు.. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ స్పందిస్తూ.. ప్రపంచ శాంతి ముప్పు కలిగించే విధంగా అమెరికా వ్యవహరిస్తోంది. నేరపూరిత రీతిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చర్యలు ఉన్నాయి అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఏ దేశం నుండి అయినా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే హక్కు క్యూబాకు ఉందని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా, క్యూబా మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే, క్యూబా లొంగిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో, ట్రంప్‌ నిర్ణయం ఎలా ఉండనుంది అనే ఉత్కంఠ నెలకొంది.

ట్రంప్‌ హెచ్చరికలు.. 
ఇక, అంతకుముందు క్యూబా విషయమై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై ఆధిపత్యం అమెరికా చేతుల్లోకి వచ్చింది. ఇకపై తమతో ఒప్పందం చేసుకుంటే తప్ప చమురు దక్కదని క్యూబాకు ట్రంప్‌ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదివారం సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. ఆలస్యం కాకముందే మేల్కోవాలని, ఒప్పందానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు. వెనెజువెలా నుంచి వస్తున్న చమురు, డబ్బుతోనే క్యూబా మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం గనుక చేసుకోకపోతే అవన్నీ ఆగిపోతాయని క్యూబాను ట్రంప్‌ హెచ్చరించారు.

ఈ సందర్భంగా ట్రంప్‌ విదేశాంగ మంత్రి రూబియో సామర్థ్యాన్ని కొనియాడుతూనే.. ఆయన భవిష్యత్తులో క్యూబాకు అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రూబియో తల్లిదండ్రులు 1950వ దశకంలో క్యూబాలోని బాటిస్టా నియంతృత్వ పాలన నుంచి తప్పించుకుని అమెరికాకు వలస వచ్చిన వారు కావడం గమనార్హం. కాగా, ట్రంప్‌ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక పక్క సరదాగా చేసిన వ్యాఖ్యలని కొందరు అంటుంటే, క్యూబా పట్ల ట్రంప్‌ ప్రభుత్వ కఠిన వైఖరికి ఇది సంకేతమని మరికొందరు విశ్లేషిస్తున్నారు.  

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)