Breaking News

Donald Trump: అబ్బా.. ఏం గుండెరా వాడిది!

Published on Thu, 06/19/2025 - 15:07

అమెరికా అధ్యక్ష భవనం చరిత్రలోనే తొలిసారి డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) హయాం ఓ అరుదైన ఘట్టానికి వేదికైంది. వైట్‌హౌజ్‌ ఆవరణలో రెండు భారీ జెండా స్తంభాలు ఏర్పాటు అయ్యాయి. పైగా అవి ప్రపంచంలోనే అత్యుత్తమ పోల్స్‌ అంటూ ట్రంప్‌ తనదైన శైలిలో ఓ ప్రకటన చేశారు కూడా.

బుధవారం ఆ పోల్స్‌ను వైట్‌హౌజ్‌ భవనం బయట దక్షిణం వైపు, ఉత్తరం వైపు మరొకటి ఏర్పాటు చేయించారు(White House Huge Poles). ఆ మరుసటి రోజు అమెరికా జెండాను ఆవిష్కరించి.. సెల్యూట్‌ చేశారు. అయితే.. మొదటి టర్మ్‌(2013-2020) టైంలోనే ఇలా ఏర్పాటు ఎందుకు చేయించలేదని కొందరు మీడియా వాళ్లు అడిగారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ‘‘చాలా కాలం కిందటే ఇలా చేయాలని అనుకున్నా. తొలి టర్మ్‌లో అన్ని కళ్లు, వేళ్లు నా వైపే ఉండేవి. ఎక్కడ నేను దొరుకుతానా? అని విమర్శకులు  వెంటాడేవాళ్లు. ఇప్పుడు నేనే అందరినీ వేటాడుతున్నా. చాలా తేడా ఉంది కదా. అందుకే ఇప్పుడు కుదిరింది’’ అని బదులిచ్చారు.

అంతేకాదు.. రియల్టర్‌ అయిన ట్రంప్‌ ఆ పోల్స్‌ను ఎంపిక చేయడం మాత్రమే కాదు.. ఎక్కడ పాతాలో(ఏర్పాటు చేయాలో) కూడా స్వయంగా స్థలాన్ని సిబ్బందికి వెతికి చూపించారట. అయితే ఆ స్తంభాలను అక్కడ ఏర్పాటు చేసిన సిబ్బందిని అభినందించే క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పోల్స్‌ ఏర్పాటు చేసిన సిబ్బంది ఒక్కొక్కరిని పిలిచి ట్రంప్‌ కరచలనం చేశారు. ఆ సమయంలో వెనకాల.. ఓ క్రేన్‌ ఆపరేటర్‌(Crane Driver Trump Funny) కునుకు తీస్తూ కనిపించాడు. అయితే ట్రంప్‌ అది గమనించకుండా సిబ్బందితో ఫొటోలు దిగసాగారు. ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది. 

అసలు అతగాడు ట్రంప్‌ ముందు అంత దర్జాగా ఆ పని ఎలా చేయగలిగాడంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు జస్ట్‌ మిస్‌ అంటూ కామెంట్‌ పెన్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకు వేసి.. అతను ఇప్పుడు అసలు ప్రాణాలతో ఉన్నాడా? అని ఆరాలు తీస్తున్నారు.

ట్రంప్‌ ఈ ఏడాది జనవరిలో అధికారంతో వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చిరాగానే.. ఓవల్‌ ఆఫీస్‌లో ఫొటోలన్నీంటిని మార్పించేశారు. పెన్సిల్వేనియాలో తనపై జరిగిన హత్యాయత్నం ఫొటోను ప్రముఖంగా ఆఫీస్‌లో ఏర్పాటు చేయించుకున్నారు. జాన్‌ ఎఫ్‌ కెనడీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రోజ్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేయించారు. అయితే ఆ గార్డెన్‌లో నిర్మాణ పనులు జరపాలని ట్రంప్‌ తాజాగా ఆదేశించారు. అందుకు ఆయన చెప్పిన కారణం.. అక్కడి గడ్డిలో హైహీల్స్‌తో నడిచేందుకు మహిళలు ఇబ్బంది పడుతున్నారని!!. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)