షీ జిన్‌పింగ్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ 

Published on Sat, 09/20/2025 - 06:29

వాషింగ్టన్‌: అమెరికా, చైనా సంబంధాల్లో మరో ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. చైనాకు చెందిన సోషల్‌ మీడియా యాప్‌ ‘టిక్‌టాక్‌’ను అమెరికాలో యథాతథంగా కొనసాగించడంపై వారు చర్చించినట్లు సమాచారం. దీనిపై త్వరలో తుది ఒప్పందానికి రావాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ఇరువురి మధ్య చర్చ ప్రారంభమైనట్లు వైట్‌హౌస్‌ అధికారులు వెల్లడించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించి, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్, జిన్‌పింగ్‌ భావిస్తున్నారు. త్వరలో ముఖాముఖి సమావేశమై ఒప్పందాన్ని కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన తర్వాత జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడడం ఇది రెండోసారి. 

వచ్చే నెలలో జిన్‌పింగ్‌ను కలుస్తా: ట్రంప్‌ జిన్‌పింగ్‌తో మాట్లాడానని, టిక్‌టాక్‌ అంశంతో పాటు వాణిజ్యంపై చర్చించానని ట్రంప్‌ శుక్రవారం వెల్లడించారు. దక్షిణ కొరియాలో వచ్చే నెల లో జరగబోయే శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జిన్‌పింగ్‌ను కలుసుకోబోతున్నానని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో చైనాకు వెళ్తానని తెలిపారు. 
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)