Breaking News

బుద్ధుడిలా ట్రంప్‌ విగ్రహాలు

Published on Tue, 01/14/2025 - 06:03

డొనాల్డ్‌ ట్రంప్‌. ఎప్పుడూ కాసింత చిరాకు ప్రతిబింబించే ముఖం. అలాంటి ముఖానికి హాంగ్‌ జిన్‌ షి అనే చైనా గ్రామీణ కళాకారుడు బుద్ధుడి ప్రశాంతతను ఆపాదించాడు. శాంతచిత్తంతో ఉన్న ట్రంప్‌ విగ్రహాలను తయారు చేశాడు. బుద్ధుని మాదిరిగా కళ్లు మూసుకుని దైవ చింతనలో కూర్చుని ఉన్న విగ్రహాలను పింగాణీతో రూపొందించాడు. సైజును బట్టి వీటిని 140 నుంచి 2,700 డాలర్ల దాకా విక్రయిస్తున్నాడు. 2021లో ఇ–కామర్స్‌ ప్లాట్‌ఫాం టావోబావోలో వైరలైన ఈ ట్రంప్‌ విగ్రహాలు ఆయన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మరోసారి ఆకర్షిస్తున్నాయి. 

సరదాగా మొదలెట్టి... 
47 ఏళ్ల హాంగ్‌ ఇప్పటిదాకా కొన్ని వందల సిరామిక్‌ వస్తువులను తయారు చేశాడు. ‘‘రాజకీయ నాయకులు సాధారణంగా బోరింగ్‌గా ఉంటారు. కానీ ట్రంప్‌ అందుకు భిన్నమైన నేత. అందుకే తొలుత సరదాగా ఆయన విగ్రహాలను రూపొందించా. ట్రంప్‌ వ్యక్తిత్వం, విగ్రహం ఆకారం పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. దాంతో వాటిని కొనేందుకు బాగా ఇష్టపడుతున్నారు’’అని చెప్పుకొచ్చాడు.

 ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’నినాదంతో ట్రంప్‌ గెలిస్తే, హాంగ్‌ మాత్రం ప్రతి విగ్రహం ప్యాక్‌పైనా ‘మీ కంపెనీని మళ్లీ గొప్పగా చేయండి’అని రాస్తున్నాడు. దీన్ని అనుసరిస్తూ అమెరికాలో పలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫ్లాట్‌ఫాంలలో కొన్ని వెర్షన్లు వచ్చాయి. ట్రంప్‌ పాలనలో ప్రధాన పాత్ర పోషించనున్న కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ విగ్రహాన్ని కూడా హాంగ్‌ డిజైన్‌ చేస్తున్నాడు. అందులో మస్‌్కను ఐరన్‌ మ్యాన్‌గా చూపిస్తున్నాడు. ట్రంప్‌కు చైనాలో ఇప్పటికీ చాలామంది అభిమానులున్నారని చెప్పాడు చెప్పారు. 
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)