Breaking News

షాకింగ్‌: బ‌ర్త్ డే రోజు.. విద్యార్థితో బ‌ల‌వంతంగా వాంతిని తినిపించిన టీచ‌ర్

Published on Tue, 10/24/2023 - 14:31

పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు మంచి ప్ర‌వ‌ర్త‌న నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు అమానుషంగా ప్ర‌వ‌ర్తించింది. చిన్నారుల‌కు చ‌దువు చెప్పించి, వారిని ఉన్న‌త స్థాయికి చేర్చేందుకు తోడ్ప‌డాల్సిన‌  టీచ‌రే హ‌ద్దుమీరి ప్ర‌వ‌ర్తించింది. పుట్టిన రోజు నాడే ఓ విద్యార్థితో అత‌డి వాంతిని తినిపించింది. ఈ  షాకింగ్ ఘ‌ట‌న చైనాలోని ల‌యోనింగ్ ప్రావిన్స్‌లో సెప్టెంబ‌ర్ 15న చోటుచేసుకోగా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

మలువాన్ కిండర్ గార్టెన్ పాఠ‌శాల‌లో ఆరేళ్ల బాలుడు న‌ర్స‌రీ చ‌దువుతున్నారు.  సెప్టెంబర్ 15న  త‌న పుట్టిన రోజు కావడంతో కొత్త దుస్తులు ధ‌రించి స్కూల్‌కు వెళ్లాడు. మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత‌.. టీచ‌ర్ అత‌డికి బ‌ల‌వంతంగా గుమ్మ‌డికాయ ముక్క‌లు తినిపించారు. అప్ప‌టికే బాలుడు ఎక్కువ‌ తిన‌డంతో వెంట‌నే వాంతులు చేసుకున్నాడు. దీంతో టీచ‌ర్ అత‌డిని వాంతిని తినాల‌ని ఆదేశించింది. 

ఇంటికి చేరుకున్న బాలుడు త‌న‌కు జ‌రిగిన విష‌యాన్ని నాన‌మ్మ‌కు చెప్పాడు. దీంతో పిల్లాడి త‌ల్లిదండ్రులు స్కూల్ యాజ‌మాన్యం దృష్టికి ఈ ఘ‌ట‌న‌ను తీసుకెళ్లారు. న‌ర్స‌రీ టీచ‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌పై పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించి, బాలుడికి బ‌ల‌వంతంగా తినిపించ‌డంతోనే వాంతింగ్ చేసుకున్న‌ట్లు నిర్ధారించారు. ఇక బాధిత బాలుడి త‌ల్లిదండ్రులు పాఠ‌శౄల యాజ‌మాన్యం క్ష‌మాప‌ణ‌లు కోరింది. అదే విధంగా స‌ద‌రు టీచ‌ర్‌ను విధుల నుంచి బ‌హిష్క‌రించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)