Breaking News

‘విడాకులు ఇవ్వలేను సార్‌’.. కోర్టు నుంచి భార్యను ఎత్తుకెళ్లిన భర్త

Published on Fri, 10/04/2024 - 12:08

విడాకులివ్వడం ఇష్టం లేని ఓ వ్యక్తి.. భార్యను ఎత్తుకొని కోర్టు నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ విచిత్ర ఘటన చైనాలో జరిగింది. లీకి, చెన్‌కి 20 ఏళ్ల కిందట పెళ్లయ్యింది. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే తాగొచ్చిన భార్యను లీ హింసిస్తున్నాడు. ఎంత చెప్పినా వినకపోవడం, భర్తలో ఎంతకీ మార్పు రాకపోవడంతో విడాకుల కోసం భార్య చెన్‌ కోర్టును ఆశ్రయించారు. గృహ హింస కింద కేసు పెట్టిన ఆమె విడాకులు ఇవ్వాలని కోర్టును కోరింది. అయితే పిల్లల పోషణ బాధ్యతల దృష్ట్యా సయోధ్య సాధ్యమని భావించిన కోర్టు తొలుత విడాకులకు నిరాకరించింది. అయినా భర్త మారకపోవడంతో చెన్‌ మళ్లీ కోర్టును ఆశ్రయించారు

విచారణకు వచ్చిన భార్యను ఎత్తుకుని కోర్టు హాల్‌ నుంచి లీ పారిపోయాడు. కోర్టు న్యాయాధికారులు వెంటనే జోక్యం చేసుకుని లీని మందలించారు. దీంతో లీ సెప్టెంబర్‌ 2న రెండో తేదీన కోర్టుకు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. మళ్లీ అలాంటి తప్పు చేయబోనని ప్రతిజ్ఞ చేశాడు. ‘విడాకులు ఇస్తున్నారని పొరపడ్డా. అందుకే ఆందోళనకు గురై భార్యను ఎత్తుకెళ్లా’’అని క్షమాపణ పత్రంలో రాశారు.

 ఎక్కడ దూరమైపోతుందోనని భర్త పడ్డ ఆవేదన చూసి భార్య మనసు కాస్తంత కరిగింది. ఇకనైనా మారతాడేమో చూద్దామని ఆయనకు మరో అవకాశం వచి్చంది. దీంతో ఈ జంటకు విడాకులు మంజూరుకాలేదు. మరోవైపు చైనాలో గృహ హింస పెద్ద సమస్యగా ఉంది. ఆల్‌–చైనా ఉమెన్స్‌ ఫెడరేషన్‌ ప్రకారం వివాహిత మహిళల్లో 30 శాతం గృహ హింసను ఎదుర్కొంటున్నారు. 60శాతం మంది మహిళల ఆత్మహత్యలకు గృహ హింసే కారణం. ‘జడ్జీలు, పోలీసుల ముందే కోర్టు నుంచి ఎత్తుకెళ్లిన వ్యక్తి.. ఒంటరిగా ఉన్నపుడు భార్యను ఎంతైనా హింసిస్తాడు’అని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)