Breaking News

అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఇరాన్‌ కొంప ముంచిన చైనా

Published on Sun, 03/01/2026 - 20:55

టెహ్రాన్‌: అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల వేళ చైనా..ఇరాన్‌ కొంప ముంచింది. అణు చర్చల తర్వాత ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడులకు తెగబడ్డాయి. ప్రతి చర్యగా ఇరాన్‌ ఇటీవల చైనా నుంచి తెచ్చుకున్న హెచ్‌-9బీ (HQ-9B)ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (SAM) వ్యవస్థను ఉపయోగించింది. అయితే, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విఫలమైంది. తద్వారా ఇరాన్‌లో భారీ ఆస్తినష్టం, ప్రాణం నష్టం జరిగినట్లు సమాచారం.

ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది క్షిపణుల ఆధారిత రక్షణ కవచం. నేల మీద గాని, నౌకల మీద గాని ఏర్పాటు చేసి, ప్రత్యర్థి విమానాలు లేదా క్షిపణులను గగనతలంలోనే కూల్చివేయడం దీని పని. ఇరాన్‌ శత్రు దేశాల నుంచి సురక్షితంగా ఉండేలా చైనా నుంచి ఆయిల్ ఫర్ వెపన్ ఒప్పందం కింద హెచ్‌క్యూ-9బీని తెచ్చుకుంది. గతేడాది ఇజ్రాయెల్‌ దాడుల సమయంలో రష్యా తయారు చేసిన ఎస్‌-300పీఎంయూ-2 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ సరిగా పనిచేయలేదు. అందుకు అప్‌గ్రేడ్‌గా ఈసారి రష్యా  నుంచి కాకుండా చైనా నుంచి ఎయిర్‌ డిఫెన్స్‌ దిగుమతి చేసుకుంది. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల వేళ ఇరాన్‌ హెచ్‌క్యూ-9బీని ఉపయోగించింది. కానీ ఇప్పుడు ఈ కొత్త వ్యవస్థ విఫలమైంది.

ఇరాన్‌లో నాటంజ్ అణు కేంద్రం,ఫోర్డో ఎన్‌రిచ్‌మెంట్ ఫెసిలిటీ, ఐఆర్‌సీజీ మిసైల్,యూఏవీ బేస్‌లు, అలాగే టెహ్రాన్, ఇస్ఫహాన్ సమీపంలో ఎయిర్‌బేసులు ఉన్నాయి. ఆ ఎయిర్‌బేస్‌లపై శత్రు దాడుల నుంచి రక్షించేలా హెచ్‌-9బీ ఎయిర్ డిఫెన్స్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎస్‌-300పీఎంయూ-2, బావర్-373, ఖోర్దాద్-15,రాద్‌, టోర్‌-ఎం2, పాంటిసిర్‌-ఎస్‌1 వంటి ఇతర రక్షణ వ్యవస్థల్ని మోహరించింది.  

అయితే అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అణుకేంద్రాలను రక్షించడంలో హెచ్‌క్యూ-9బీ ఆధారిత రక్షణ పూర్తిగా విఫలమైంది. 31 ప్రావిన్స్‌లో 20కి పైగా ప్రాంతాలు అమెరికా,ఇజ్రాయెల్‌ దాడుల్లో తీవ్ర ప్రభావితమయ్యాయి.  

ఒక్క ఇరాన్‌ మాత్రమే కాదు..గతంలో పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఆపరేషన్‌ సిందూర్‌ను తిప్పికొట్టేలా చైనా నుంచి పాకిస్థాన్‌ తెచ్చుకున్న హెచ్‌క్యూ-9బీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ తేలిపోయింది. ఇప్పుడు ఇరాన్‌లో సైతం చైనా డిఫెన్స్‌ ఎయిర్‌ సిస్టం విఫలం కావడంతో ప్రపంచ దేశాల ఎదుట చైనా భంగపాటుకు గురైంది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)