Breaking News

స్నేహబంధం బలోపేతం

Published on Wed, 09/03/2025 - 05:34

బీజింగ్‌: అమెరికా విసిరిన టారిఫ్‌ల సవాళ్లతో ఇక్కట్లు ఎదురవుతున్న వేళ చైనా, రష్యా తమ చిరకాల స్నేహబంధాన్ని మరింత బలపరుచుకుంటు న్నాయి. చైనాలోని తియాంజిన్‌లో సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు జరిగిన మర్నాడే ఇరు దేశాలు మంగళవారం మరోసారి సమావేశమై ద్వైపాక్షిక చర్చలు చేపట్టాయి. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. చర్చల కోసం రాజధాని బీజింగ్‌ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సాదర స్వాగతం పలికారు.

పుతిన్‌ను ‘చిరకాల మిత్రుని’గా అభివర్ణించారు. పుతిన్‌ సైతం తన ప్రసంగంలో జిన్‌పింగ్‌ను ప్రియ స్నేహితునిగా సంబోధించారు. ‘నాడు మేము కలిసే ఉన్నాం.. ఇప్పుడు కూడా కలిసే ఉంటాం’అని పుతిన్‌ చెప్పుకొచ్చారు. ఇరు దేశాధినేతల లాంఛన సమావేశం అనంతరం చైనా అధికార కేంద్ర స్థానమైన ఝోంగన్‌హాయ్‌లో ఇరుపక్షాల ఉన్నతాధికారుల మధ్య తేనీటి విందు భేటీ జరిగింది.

రష్యా పర్యాటకులకు ఈ నెల నుంచి 30 రోజులపాటు వీసారహిత సదుపాయం కల్పించనున్నట్లు చైనా ప్రకటించింది. అలాగే చైనాకు మరో సహజవాయు పైప్‌లైన్‌ను నిర్మించేందుకు ఆ దేశంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు రష్యా ప్రభుత్వరంగ చమురు సంస్థ గాజ్‌ప్రోం సీఈఓ అలెక్సీ మిల్లర్‌ తెలిపారు. ప్రస్తుత పైప్‌లైన్‌ మార్గాల ద్వారా సహజవాయు సరఫరాను మరింత పెంచేందుకు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)