Breaking News

చైనాలో ఊహించని విపత్తు.. తప్పించుకున్న 900 పాములు

Published on Thu, 07/09/2026 - 19:48

బీజింగ్: చైనాపై ప్రకృతి పగబట్టింది. తీవ్రమైన వరదలు, భారీ వర్షాలతో డ్రాగన్‌ దేశం అతలాకుతలమవుతోంది. దేశంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, గ్వాంగ్జీ (Guangxi) ప్రాంతంలో ఒక వింతైన, భయంకరమైన పరిస్థితి తలెత్తింది. వరద నీటి ఉధృతికి స్థానిక పెంపకం కేంద్రాల నుంచి వందలాది పాములు తప్పించుకుని ఊళ్లపై పడటంతో అధికారులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాల ప్రకారం.. గ్వాంగ్జీ ప్రాంతంలో వరదలు ముంచెత్తడంతో దాదాపు 900కు పైగా పాములు పెంచే కేంద్రాల నుంచి బయటకు వచ్చాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాములు వంటి విషసర్పాలు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. లోతైన వరద నీటిలో పాములు ఈదుకుంటూ వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

గ్వాంగ్జీ పరిధిలోని హెంగ్‌జౌ నగరంలో వరద నీరు,రోడ్లు బ్లాక్ అవ్వడం వల్ల ఒక విషాదం చోటుచేసుకుంది. వరదల్లో కొట్టుకువచ్చిన పాము కాటుకు గురైన ఒక మహిళ, సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో, పాము కాటు బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు ప్రభుత్వం తాత్కాలిక వైద్య క్లినిక్‌లను ఏర్పాటు చేసింది.

అలాగే తప్పించుకున్న పాములను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. చైనాలోనే సాంప్రదాయ వైద్యం, తోలు ఉత్పత్తులు మాంసం కోసం వాడే వాణిజ్య పాముల పెంపకానికి గ్వాంగ్జీ అతిపెద్ద కేంద్రం. ఇక్కడ సుమారు 3 కోట్లకు పైగా సర్పాలను పెంచుతుంటారు. హెంగ్‌జౌ పరిసరాల్లోని పలు గ్రామాలు నీట మునగడంతో ఈ పాములన్నీ వరద నీటిలోకి చేరాయని ప్రాంతీయ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

విపత్తులు, విషసర్పాల ప్రమాదం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అత్యవసర సహాయక చర్యలను పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. 

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)