Breaking News

షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో మహిళకు వేధింపులు : చైనా రియాక్షన్‌ ఇదే

Published on Tue, 11/25/2025 - 17:48

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన మహిళను చైనా అధికారులు షాంఘై విమానాశ్రయంలో 18 గంటల పాటు అక్రమంగా నిర్బంధించిన ఘటనలో చైనా స్పందించింది. షాంఘై విమానాశ్రయంలో భారతీయ మహిళను వేధించారనే ఆరోపణలను చైనా ఖండించింది. థాంగ్డోక్‌కు ఎదురైన అనుభవంపై స్పందన కోరగా, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆ మహిళ ఆరోపించినట్లుగా ఎటువంటి తప్పనిసరి చర్యలు, నిర్బంధం లేదా వేధింపులకు లేవని పేర్కొన్నారు.

లండన్‌ నుంచి జపాన్‌కు ప్రయాణిస్తున్నకి షాంఘై పుడాంగ్‌ విమానాశ్రయంలో  భారతీయ మహిళలను అడ్డుకున్న దుమారం రేగిన  ఒక రోజు తరువాత  డ్రాగన్‌ కంట్రీ దీనిపై వివరణ ఇచ్చింది. నవంబర్ 21న లండన్ నుండి జపాన్‌కు ప్రయాణిస్తున్న యూకేకి చెందిన భారతీయ పౌరురాలు పెమా వాంగ్‌జోమ్ థాంగ్‌డాక్, పాస్‌పోర్ట్‌లో జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని పేర్కొనడంపై ఎయిర్‌పోర్ట్‌ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది తనను ఆపారని తెలిపింది. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీసుకున్న చర్యలు చట్టాలు , నిబంధనల ప్రకారం ఉన్నాయని పేర్కొంటూ ఈ సందర్భంగా వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. 

కాగా అరుణాచల్ చైనా భూభాగం అంటూ షాంఘైలో విమానంలో దిగిన  థాంగ్లో పాస్‌పోర్ట్‌ను చూసిన చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అమె పట్ల  దురుసుగా ప్రవర్తించారు.  జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తించిన వెంటనే  అరుణాచల్ ప్రదేశ్  చైనాలో భాగం,  కనుక ఇండియన్‌  పాస్‌పోర్ట్ చెల్లదని వాదించి అవమానించి వేధింపులకు గురిచేశారు.  తదుపరి విమానం ఎక్కకుండా,  కనీసం ఆహారం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె థాంగ్‌డోక్ తన స్నేహితుడి ద్వారా షాంఘైలోని భారతీయ కాన్సులేట్‌కు సమాచారం అందించింది. భారతీయ అధికారుల జోక్యం తర్వాత ఆమెను రాత్రి ఆలస్యంగా విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)