Breaking News

‘నీ ఆశయాన్ని అంతం కానివ్వను’.. చార్లీ కిర్క్ భార్య భావోద్వేగ ప్రసంగం..

Published on Sat, 09/13/2025 - 08:38

వాషింగ్టన్‌: ‘నీ ఆశయాన్ని అంతం కానివ్వను..ఈ దేశం ఇప్పటివరకు చూడని గొప్ప విషయంగా దానిని మారుస్తాను’ అంటూ డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ తన భర్తను గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో అన్నారు. బుధవారం యుటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమానికి హాజరైన రైట్‌ వింగ్‌  కార్యకర్త, డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. చార్లీ కిర్క్ హత్య అనంతరం అతని భార్య ఎరికా కిర్క్ తొలిసారిగా బహిరంగంగా మాట్లాడారు.

తన భర్త  పాడ్‌కాస్ట్‌ను హోస్ట్ చేసే కార్యాలయం నుండి ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. తాను అమెరికాను, ఇక్కడి ప్రకృతిని, చికాగో కబ్స్‌ను అమితంగా ప్రేమిస్తున్నానని అన్నారు. తన భర్త చార్లీ తనను, పిల్లలను హృదయపూర్వకంగా ప్రేమించారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన భర్తను హత్య చేసినవారిని పట్టుకున్న చట్ట అమలు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడు టైలర్ రాబిన్సన్ ను ఉద్దేశిస్తూ ఆమె ‘నాలో రగులుతున్న  అగ్ని గురించి నీకు తెలియదు. ఈ వితంతువు  రోదనలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ నాదాలుగా  ప్రతిధ్వనిస్తాయి’ అంటూ ఎరికా కిర్క్ కన్నీరు పెట్టుకున్నారు.

ఎరికా 2021లో చార్లీ కిర్క్‌ను వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. తన భర్త ట్రంప్‌ను అమితంగా ఇష్టపడేవారని, తన భర్త అందించిన రేడియో షో, పాడ్‌కాస్ట్‌ను కొనసాగిస్తూ, తన భర్త ఆశయాలను సజీవంగా ఉంచుతానని ఆమె పేర్కొంటూ,  ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఆయనకు అండగా నిలిచారు. ఆయన కూడా మీ కోసం పనిచేశారు అని  ఎరిక్‌ అధ్యక్షుడు ట్రంప్‌తో అన్నారు.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)