Breaking News

కెనడా ఎన్నికల్లో పాక్‌ జోక్యం?: కెనడా ఆరోపణ

Published on Tue, 03/25/2025 - 13:31

న్యూఢిల్లీ: భారతదేశానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెరుగుతున్న మద్దతు దృష్టా, దానిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్(Pakistan) ఏప్రిల్ 28న కెనడాలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉందని  ఆ దేశం ఆరోపించింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్‌ఐఎస్‌) డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ వెనెస్సా లాయిడ్ ఈ ఆరోపణలు చేశారు.

పాకిస్తాన్‌లో రాజకీయ భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించేందుకు, భారతదేశానికి(India) పెరుగుతున్న మద్దతును ఎదుర్కొనేందుకు పాక్‌ తన వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా  కెనడాతో విదేశీ  దౌత్య కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా కెనడా.. పాక్‌, భారత్‌లపై ఇలాంటి ఆరోపణలను మోపింది. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

2021, 2019 కెనడా సార్వత్రిక ఎన్నికల(Canadian general election) సమయంలోనూ భారతదేశం, పాకిస్తాన్ రహస్యంగా జోక్యం చేసుకున్నాయని కెనడా ఆరోపించింది. ఎన్‌డీటీవీ ఒక కథనంలో.. రాబోయే కెనడా ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని పరిశీలిస్తున్న సమాఖ్య 2024లో గూఢచారి సంస్థ అందించిన సమాచారాన్ని విడుదల చేసిందని పేర్కొంది. ఖలిస్తానీ ఉద్యమం లేదా పాకిస్తాన్ అనుకూల వైఖరికి సానుభూతిపరులైన భారతీయ సంతతికి చెందిన ఓటర్లు కెనాడాలో ఉన్నారని వెనెస్సా లాయిడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాక్సీ ఏజెంట్ అనుకూల అభ్యర్థులకు అక్రమ ఆర్థిక సహాయం  అందించిన ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయిని లాయిడ్‌ ఆరోపించారు. కెనడా ఎన్నికల్లో భారత్, చైనాలు జోక్యం చేసుకునే అవకాశం ఉందని కెనడా ఆందోళన వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)