Breaking News

కెనడా కాల్పుల ఘటన: నిందితుని ఉన్మాదం వెనుక..

Published on Thu, 02/12/2026 - 12:34

వాంకోవర్‌: కెనడాలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో నిందితునికి సంబంధించిన విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ‘జెస్సీ’ అనే యువకుడు సృష్టించిన బీభత్సానికి పదిమంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో జెస్సీ కన్నతల్లి, సోదరితో పాటు ఒక ఉపాధ్యాయురాలు, అభం శుభం తెలియని పసిపిల్లలు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురు ఆస్పత్రులలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
 

ఈ ఉన్మాదానికి వెనుక ఉన్న కారణాలు ఇప్పడు వార్తల్లో నిలిచాయి. జెస్సీ గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతను ఎప్పుడైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వానికి, సంబంధిత ఏజెన్సీలకు ముందే తెలుసని సమాచారం. అయినప్పటికీ అతడిని ఒక రోగిగా గుర్తించి, సరైన మానసిక చికిత్స అందించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం జెస్సీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సింది పోయి, అతడిని ఒక అమ్మాయిగా పరిగణించి కృత్రిమమైన పద్ధతులను ప్రోత్సహించిందనే మాట వినిపిస్తోంది. అతనికి ‘క్రాస్ సెక్స్ హార్మోన్లు’, ఇతర మందులను ఇవ్వడం ద్వారా అతని శరీరాన్ని, ఆలోచనా తీరును విషపూరితం చేశారని తెలుస్తోంది. ఒక మానసిక రోగి భ్రమలను సరిదిద్దకుండా, వాటిని మరింతగా ప్రేరేపించిన కారణంగానే అతను తనపై తాను నియంత్రణ కోల్పోయి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)