Breaking News

అమెరికాతో పాతబంధం ముగిసింది.. ప్రతిచర్య తప్పదు: మార్క్‌ కార్నీ

Published on Fri, 03/28/2025 - 08:59

ఒట్టావా: అమెరికా-కెనడా మధ్య ఆర్థిక, భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందంటున్నారు కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ(Mark Carney). ఆటో ఉత్పత్తులపై సుంకాలు విధింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేసిన నేపథ్యంలోనే కార్నీ ఇలా ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆటో ఉత్పత్తులపై 25శాతం సుంకాలు విధిస్తానంటూ ట్రంప్‌(Trump Tariffs) తాజాగా వ్యాఖ్యానించారు. వచ్చే వారం నుంచి ఇది అమల్లోకి రానుండగా.. ఈ నిర్ణయం ఐదు లక్షల మంది ఉద్యోగులు పని చేసే  కెనడా ఆటో పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో తన ఎన్నికల ప్రచారాన్ని సైతం పక్కన పెట్టి మరీ కార్నీ ఒట్టావా చేరుకుని కేబినెట్‌ భేటీ నిర్వహించారు. 

ట్రంప్‌ ఆటో టారిఫ్‌లను అన్యాయంగా అభివర్ణించిన కార్నీ.. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల ఆర్థిక, భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. అలాగే.. ట్రంప్‌ ఆటో టారిఫ్‌లకు కెనడా ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే.. జస్టిన్‌ ట్రూడో స్థానంలో మార్క్‌ కార్నీ కెనడాకు ప్రధాని అయ్యారు. సాధారణంగా కెనడా ప్రధాని బాధ్యతలు చేపట్టాక అగ్రరాజ్య అధ్యక్షుడితో ఫోన్‌ కాల్‌ మాట్లాడడం ఆనవాయితీగా వచ్చేది. అయితే కార్నీ దానిని బ్రేక్‌ వేశారు. ఇప్పటిదాకా ఆయన ట్రంప్‌తో మాట్లాడకపోవడం గమనార్హం. ట్రంప్‌తో మాట్లాడడానికి తనకేమీ అభ్యంతరాలు లేవని.. అయితే తన దేశానికి తగిన గౌరవం ఇస్తేనే అది జరుగుతుందని కార్నీ ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రాబోయే రెండు, మూడో రోజుల్లో ఇరు దేశాల అధినేతలు మాట్లాడుకోవచ్చని వైట్‌హౌజ్‌ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి: కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ.. అసలు ఎవరీయన?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)