Breaking News

కెనడా, చైనా స్నేహగీతం 

Published on Sat, 01/17/2026 - 06:08

బీజింగ్‌: కెనడా క్రమంగా అమెరికాకు దూరమవుతూ చైనాకు దగ్గరవుతోంది. చైనా నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్‌ వాహనాలపై టారిఫ్‌లను 100 శాతం తగ్గించనున్నట్టు కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ శుక్రవారం ప్రకటించారు. కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై చైనా ఇప్పటికే టారిఫ్‌లను 84 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఇరుదేశాల నేతలు రెండు రోజుల క్రితం బీజింగ్‌లో సమావేశమయ్యారు. వాణిజ్య బంధం బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఐదేళ్లలో చైనా నుంచి 70 వేలకు పైగా ఈవీలను దిగుమతి చేసుకుంటామని కార్నీ వెల్లడించారు. గత రెండు రోజులు చరిత్రాత్మక, ఫలవంతమైన దినాలు అంటూ వ్యాఖ్యానించారు. 

కెనడాతో సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్తామని చైనా అధినేత జీ జిన్‌పింగ్‌ స్పష్టంచేశారు. గత ఏడాది అక్టోబర్‌లో మార్క్‌ కార్నీతో సమావేశమయ్యాయని, చైనా–కెనడా సంబంధాల్లో అప్పుడే నూతన అధ్యాయం ప్రారంభమైందని స్పష్టంచేశారు. గత ఎనిమిదేళ్లలో చైనాలో పర్యటించిన తొలి కెనడా ప్రధానిగా మార్క్‌ కార్నీ రికార్డుకెక్కారు. వాస్తవానికి కెనడా, చైనాల మధ్య టారిఫ్‌ల యుద్ధం నడిచింది. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత కెనడా  ప్రభుత్వం చైనా వైపు మొగ్గుచూపుతోంది.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)