ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. బెడిసికొట్టిన ప్లాన్‌!

Published on Sun, 02/02/2025 - 11:56

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. కెనడా, మెక్సికోపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించడంపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. ట్రంప్‌ తప్పుడు పద్దతుల్లో వెళ్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో, అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు కెనడా, మెక్సికో దేశాలు సిద్ధమయ్యాయి. అలాగే, ట్రంప్‌ నిర్ణయాన్ని డబ్ల్యూటీవో సవాల్‌ చేస్తానని చైనా హెచ్చరించింది.

డొనాల్డ్‌ ట్రంప్‌.. కెనడా, మెక్సికో, చైనాపై సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఆ దేశాలు కౌంటరిస్తున్నారు. ఈ  క్రమంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మాట్లాడుతూ.. ‘155 బిలియన్ కెనడియన్‌ డాలర్ల అమెరికా దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నాం. వాషింగ్టన్‌ చర్యలకు ఇది కె‘నడా ప్రతిస్పందన. ఇందులో 30 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయి. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని అధ్యక్షుడు ట్రంప్‌ అనుకుంటే.. మాతో భాగస్వామ్యాన్ని కోరుకోవాలి. అదే వారికే మంచింది’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

మరోవైపు.. మెక్సికో కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. తాజాగా మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌  మాట్లాడుతూ.. ‘మెక్సికో పొరుగు దేశాలతో సహకారం కోరుకుంటుంది. మేము ఎప్పుడూ ఘర్షణలు కోరుకోము. డ్రగ్స్‌ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. మా ప్రభుత్వం నాలుగు నెలల్లో 20 మిలియన్‌ డోస్‌ ఫెంటనిల్ సహా 40 టన్నులకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాం. పదివేల మందిని అరెస్టు చేశాం.  మాదకద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే.. అందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. టారిఫ్‌లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావు. మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటాం. ప్లాన్ బీని అమలు చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ట్రంప్‌ చర్యలపై చైనా కూడా మండిపడింది. తాజాగా చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందిస్తూ.. చైనా ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోంది. ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచ వాణిజ్య సంస్థలో ట్రంప్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తాం. చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా.. సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయి. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా.. తన దేశంలో ఫెంటనిల్‌ వంటి సమస్యలను సొంతగా పరిష్కరించుకోవాలి. తప్పుడు పద్ధతులను సరిచేసుకోవాలని అమెరికాను కోరుతున్నాం అంటూ హితవు పలికింది.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)