Breaking News

అరబ్ పార్టీలపై నెతన్యాహు సంచలన ఆరోపణలు

Published on Thu, 10/29/2026 - 16:10

జెరూసలేం: ఇజ్రాయెల్‌ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌ పార్టీ.. అక్కడి అరబ్‌ పార్టీలు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాయంటూ ఆరోపణలు చేసింది. అంతేకాదు అరబ్‌ పార్టీలు ఇజ్రాయెల్‌ను ‘ఇస్లామీకరణ’ చేయాలని చూస్తున్నాయంటూ నెతన్యాహు వ్యాఖ్యానించారు.

ఇప్పటివరు​కు జరిగిన సుమారు 93 శాతం ఓట్ల లెక్కింపు ఆధారంగా నెతన్యాహు కూటమికి 53 సీట్లు, ప్రతిపక్ష కూటమికి 48 సీట్లు వచ్చినట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. అరబ్‌ పార్టీలన్నిటికీ కలిపి 19 సీట్లు వచ్చే అవకాశముంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

అరబ్‌ పార్టీలపై అక్రమాల ఆరోపణలు
మంగళవారం జరిగిన ఎన్నికల్లో అరబ్‌ పార్టీలకు చెందిన పోలింగ్‌ కేంద్రాల్లో లంచాలు, బెదిరింపులు, హింస, నకిలీ పత్రాలు, ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటు వేయడం వంటి అక్రమాలు జరిగినట్లు లికుడ్‌ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులతో పాటు సంబంధిత ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు కూడా ఆ పార్టీ వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు.

మళ్లీ ఎన్నికలు తప్పవా?
ఒకవేళ ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే ఇజ్రాయెల్‌లో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అప్పటివరకు నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కోట్‌ అరబ్‌ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డెమోక్రాట్స్‌ నేత యైర్‌ గోలన్‌ సూచించారు. ఇక ఈ ఎన్నికల్లో దాదాపు 77.7 శాతం పోలింగ్‌ నమోదైంది. 2023 అక్టోబర్‌ 7న జరిగిన హమాస్‌ దాడి తర్వాత ఇజ్రాయెల్‌లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు కావడంతో ఇజ్రాయెల్‌ దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి: రేవంత్‌ రాసిన రాజ్యాంగమే తెలంగాణలో నడుస్తోంది: కేటీఆర్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)