Breaking News

బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాజీనామా

Published on Sat, 08/10/2024 - 14:19

బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు భగ్గుమన్నాయి. బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని నిరసనలు డిమాండ్‌ చేశారు. సీజేఐతోపాటు ఇతర న్యాయమూర్తులు పదవి నుంచి దిగిపోవాలంటూ భారీ ఎత్తున విద్యార్ధులు ఢాకాలోని కోర్టు వద్ద గుమిగూడి నిరసనలు చేశారు.  చీఫ్‌ జస్టిస్‌ గంటలో దిగిపోవాలంటూ డిమాండ్లు చేశారు.

వీటికి సీజేఐ అంగీకరించారు. తన పదవికి రాజీనామా చేస్తానని ఒబైదుల్‌ హసన్‌ వెల్లడించారు. కాగా ఒబైదుల్‌ హసన్‌ గత ఏడాదిలోనే బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు విధేయుడిగా ఉండేవారు. 

అయితే దేశంలో రిజర్వేషన్లపై నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే సీజేఐ కూడా దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో ఈ నిరసనలు ఒక్కసారిగా చెలరేగాయి. 

బంగ్లాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలు ఇటీవల ఉద్రిక్తంగా మారాయి.  గత ఆదివారం మరోసారి హింస చెలరేగి.. 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ  నిరసనల్లో ఇప్పటి వరకు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ సహా పలు దేశాలు తమ పౌరులకు సూచనలు చేశాయి. బంగ్లాదేశ్‌లో ఎవరూ పర్యటించవద్దని హెచ్చరించాయి. మరోవైపు దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. తాత్కాలిక పరిపాలన యంత్రాంగానికి యూనస్‌ను సారథిగా నియమితులయ్యారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)