Breaking News

ఖమేనీ, అతడి కుమారుడి హత్యకు అమెరికా ప్లాన్‌.. సంచలన నివేదిక

Published on Sat, 02/21/2026 - 13:47

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా దాడులపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని టార్గెట్‌ చేసి హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తాజాగా ఆక్సియోస్(Axios) నివేదికలో పేర్కొంది. దీంతో, ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

అణు ఒప్పందం అంశంపై ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉదిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌​కు అల్టిమేటం జారీ చేశారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్‌ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్‌ సమీపంలో అమెరికా సైన్యం దాడులు చేసేందుకు రెడీగా కూడా ఉంది. ఇరాన్‌కు సమీపంలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అనుమతి కోసం వేచిచూస్తున్నాయి. అత్యాధునిక విమానాలు మిడిల్ ఈస్ట్‌కు చేరాయి. మరోవైపు, ఇరాన్ రష్యాలు కలిసి హార్మోజ్ జలసంధిలో యుద్ధ విన్యాసాలు ప్రారంభించాయి.

ఇలాంటి తరుణంలో ఆక్సియోస్ నివేదిక అమెరికా దాడులు, ఖమేనీ గురించిన సంచలన విషయాలను బయటపెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుని హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు నివేదికలో పేర్కొంది. ఈ సైనిక ఆప్షన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచినట్లు తెలిపింది. మొజ్తాబాను సుప్రీం లీడర్ వారసుడిగా అంతా భావిస్తున్నారు. ఇరాన్ అగ్రనేతలతో పాటు కీలకమైన ముల్లాలను అంతమొందించేలా రక్షణ శాఖ పలు ఆప్షన్లను ట్రంప్ ముందు ఉంచింది. అయితే, దీనిపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ నిర్ణయం తీసుకుంటే ఇరాన్‌పై అమెరికా దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మరోవైపు.. అధ్యక్షుడు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదని పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా వైట్‌హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ స్పందిస్తూ.. అధ్యక్షుడు ట్రంప్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలుసు అని వ్యాఖ్యలు చేశారు. సీనియర్ల సలహాదారులు, అధికారులు కూడా ఇదే విషయం చెబుతున్నారు.  ఇక, ఓ వైపు ఇరాన్‌తో అణు చర్చలు జరుపుతూనే అమెరికా సైనికంగా ఆ దేశంపై ఒత్తిడి తీసుకువస్తోంది.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు