Breaking News

Air India: పాక్‌ గగనతలంపై ఆంక్షలు.. ఎయిరిండియాకు వేల కోట్ల నష్టం

Published on Fri, 05/02/2025 - 07:55

ఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాం భూతల  స్వర్గం.. ఆ ప్రదేశంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడితో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో పాకిస్తాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్‌లోని ప్రముఖ ఏవియేషన్‌ దిగ్గజం ఎయిరిండియాకు వేలకోట్ల నష్టం వాటిల్లింది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్‌ కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీంతో పాక్‌  సైతం భారత్‌పై పలు ఆంక్షలు విధించింది. పాక్‌ గగన తలంపై భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

ఆ నిర్ణయంతో ఎయిరిండియా సుమారు 600 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పాక్‌ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై నిషేదం కారణంగా విమానాల దారి మళ్లింపు, పెరిగిన ప్రయాణ దూరం, అదనపు ఇంధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా ప్రతీ ఏడాది తమ సంస్థకు 591 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ నష్టం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని కోరుతూ విమానయాన శాఖకు ఎయిరిండియా యాజమాన్యం లేఖ రాసినట్లు సమాచారం. గగనం తలంపై పాక్‌ తీసుకున్న నిర్ణయంతో ఒక్క ఎయిరిండియా మాత్రమే కాదని టాటా గ్రూప్‌కు చెందిన ఇతర విమానాల సర్వీసులపై ప్రభావం పడనున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.

ఉదాహరణకు ఇండిగో గురువారం న్యూఢిల్లీ-బాకు (అజర్‌బైజాన్‌లో) విమానం ఐదు గంటల 43 నిమిషాలు ప్రయాణించింది. పాక్‌ గగన తలం నుంచి కాకుండా దారి మళ్లించిన కారణంగా 38 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయానికి అదనంగా ఇంధనం వెచ్చించాల్సి ఉంటుంది.  ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అందించే ఇతర సర్వీసుల్లో సైతం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అయితే, మిగితా విమానయాన సంస్థలతో పోలిస్తే ఎయిరిండియా పలు ప్రపంచ దేశాలకు విమానాల రాకపోకలన్నీ పాకిస్తాన్‌ గగన తలం నుంచే నిర్వహిస్తుంది. పాక్‌ తాజా నిర్ణయం ఎయిరిండియాపై కాస్త ప్రతికూల ప్రభావం పడనుంది. ఉదాహరణకు, ఢిల్లీ-మిడిల్ ఈస్ట్ విమానాలు ఇప్పుడు కనీసం ఒక గంట అదనంగా ప్రయాణించవలసి వస్తుంది, దీనికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది.

ఎయిరిండియా దాని బడ్జెట్ సర్వీస్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగోలు గత నెలలో పదిహేను రోజుల్లో న్యూఢిల్లీ నుండి యూరప్, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికాలోని గమ్యస్థానాలకు 1,200 విమానాలు బయలుదేరాయని అంచనా.

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు