మాతో పెట్టుకుంటే అంతే.. ఇరాన్ మంత్రి

Published on Sat, 03/14/2026 - 13:48

టెహ్రాన్: ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో రెండు వారాల యుద్ధానికే అమెరికా పనైపోయిందని తెలిపారు. వాషింగ్టన్‌ ఇప్పుడు భారత్‌తో పాటు అనేక దేశాలను రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేయాలని అడుక్కుంటుందని ఆరోపించారు.

పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. హార్మూజ్‌ జలసంధిని ఇరాన్ మూసివేయడం చమురు వాణిజ్యానికి ఆటంకం తలెత్తింది. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్  స్థావరాలపై దాడులు చేయడంతో క్రూడాయిల్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే ట్రంప్ గతంలో విధించిన ఆంక్షలు సడలించారు. ప్రపంచ దేశాలు తాత్కాలికంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కౌంటరిచ్చారు,

ఆయన మాట్లాడుతూ " గత కొద్ది నెలలుగా అమెరికా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయద్దంటూ ఆంక్షలు విధించింది. ఇరాన్‌తో 15 రోజులు యుద్ధం చేయగానే పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు భారత్‌తో సహా ఇతర దేశాలని రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని యాచిస్తుంది. యూరప్ సైతం ఈ అక్రమ యుద్ధంలో మద్దతు ఇవ్వడం ద్వారా రష్యాకు వ్యతిరేకంగా యుఎస్ సపోర్టు లభిస్తోందని భావిస్తోంది" అని అన్నారు. వారి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉందని తెలిపారు.

కాగా ఇంతకాలం రష్యాతో చమురు కొనుగోలు ఇతర దేశాలను అమెరికా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మాస్కో నుంచి పన్ను కొనుగోలు చేసిన వారిపై అధిక పన్నులు విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌పైన తొలుత పన్నులు పెంచి అనంతరం రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేశారని ప్రకటించింది. అయితే ఇటీవలే రష్యా నుంచి తాత్కాలికంగా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చని ఆదేశించినట్లు తెలిపింది. కాగా దీనిపైఇరాన్ విదేశాంగమంత్రి స్పందించారు.

కాగా ప్రస్తుతం ఇరాన్ భారత్ విషయంలో సానూకులంగా ఉంది. ఇటీవలే భారత విదేశాంగ మంత్రి జైశంకర్  ఇరాన్ విదేశాంగశాఖ మంత్రితో చర్చలు జరిపారు.ఈ నేపథ్యంలో భారత్ వెళ్లే చమురు నౌకలకు ఇరాన్ అనుమతి తెలిపింది. ఇటీవల భారత్ పతాకంతో ఉన్న రెండు నౌకలు హార్మూజ్ గుండా ఇండియాకు చేరుకున్నాయి.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)