Breaking News

‘సిందూర్’లో తునాతునకలైన పాక్‌ యుద్జ విమానాలివే..

Published on Wed, 06/04/2025 - 15:20

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన దరిమిలా, భారతదేశం ప్రతీకార సైనిక చర్యగా ‘ఆపరేషన్ సిందూర్‌’ను చేపట్టింది. దీనిలో  పాకిస్తాన్ వైమానిక దళం (పీఏఎఫ్‌)నకు చెందిన ఆరు యుద్ధ విమానాలు(Fighter jets), రెండు ఎంతో విలువైన నిఘా విమానాలు, పదికి పైగా సాయుధ డ్రోన్‌లు, ఒక సీ-130 హెర్క్యులస్ రవాణా విమానం ధ్వంసమయ్యిదని భారత అధికార వర్గాలు తెలిపాయి.

భారత వైమానిక రక్షణ విభాగాలు పాక్‌ విమానాలను గగనతల పోరాటంలో నాశనం చేశాయి. పాకిస్తాన్‌లోని పంజాబ్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో ఈ యుద్ధాలు జరిగాయి. ఈ జెట్‌ల కూల్చివేతలను రాడార్ ట్రాకింగ్ ద్వారా నిర్ధారించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢీకొన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత పాకిస్తానీ విమానం ట్రాకింగ్ గ్రిడ్‌ల నుండి అదృశ్యమైందని ఆ వర్గాలు వివరించాయి. పాకిస్తాన్ భోలారి వైమానిక స్థావరంలో ఉంచిన స్వీడిష్‌కు చెందిన మరో ఏఈడబ్ల్యూ అండ్‌ సీవిమానం ఎయిర్-టు-సర్ఫేస్ క్రూయిజ్ క్షిపణి దాడిలో ధ్వంసమైంది.

ఐఏఎఫ్‌ మానవరహిత వ్యవస్థలపై కూడా  దాడులు చేసింది. రాఫెల్, ఎస్‌యూ-30 జెట్‌లతో కూడిన ఆపరేషన్‌లో చైనాకు చెందిన ఎలిట్యూడ్, లాంగ్-ఎండ్యూరెన్స్ డ్రోన్‌లను కలిగిన హ్యాంగర్ ధ్వంసమయ్యింది. భారత వైమానిక రక్షణ విభాగాలు సంఘర్షణ సమయంలో జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌లోని పలు పాకిస్తాన్ యూసీఏవీలను అడ్డగించి కూల్చివేశాయి. మే  ఆరు-ఏడు తేదీల మధ్యరాత్రి పాకిస్తాన్‌(Pakistan)లోని పంజాబ్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేయడంతో భారతదేశం తన సైనిక ప్రతిస్పందన ప్రారంభించింది.

బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే-ఎ-తోయిబా శిబిరం, ముజఫరాబాద్, కోట్లి, రావలకోట్, భీంబర్, చక్వాల్‌లోని తొమ్మిది  ఉగ్ర స్థావరాలను భారత సైన్యం గుర్తించింది. భారత్‌ తన తొలి దాడుల తర్వాత, పశ్చిమ సరిహద్దు వైపు డ్రోన్లు, బాలిస్టిక్  క్షిపణులను  ప్రయోగించింది. కాగా తీవ్రమైన దౌత్యపరమైన ఒత్తిడి అనంతరం పాకిస్తాన్ డిజిఎంఓ, మేజర్ జనరల్ కాశిఫ్ అబ్దుల్లా.. భారత లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌ను సంప్రదించి తక్షణ కాల్పుల విరమణకు అభ్యర్థించారు. తదనంతరం భారత్‌ సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి అంగీకరించింది. అయితే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తిరిగి భారత్‌ ప్రతీకార దాడులకు దిగుతుందని హెచ్చరించింది. 

ఇది ​కూడా చదవండి: బీహార్‌లో మరో దారుణం.. తొమ్మిదేళ్ల దళిత బాలిక విలవిల

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)