"సెవన్‌ సిస్టర్స్ చీలిపోతుంది"

Published on Tue, 12/16/2025 - 20:02

బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్‌ హసంత్ అబ్దుల్లా భారత్‌పై కారు కూతలు కూశారు. భారత్‌ను చీల్చే ప్రయత్నాలు చేసే వ్యక్తులకు, సంస్థలకు తమ దేశం ఆశ్రయం ఇస్తుందని విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఆశ్రయంతో  భారత్‌లోని ఈశాన్యప్రాంతం ప్రాంతం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని తీవ్రంగా మాట్లాడారు. కాగా ఆ వ్యాఖ్యలను అస్సాం ముఖ్యమంత్రి  హిమంత బిశ్వ శర్మ ఖండించారు.

బంగ్లాదేశ్ ఎన్సీపీ లీడర్ అబ్దుల్లా భారత్‌ను బెదిరిస్తూ పిచ్చిగా మాట్లాడారు.  అబ్దుల్లా మాట్లాడుతూ "నేను ఒక విషయం భారత్‌కు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు, ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తాం. దానివల్ల భారత్‌ నుంచి ఈశాన్య ప్రాంతం వేరయ్యే అవకాశముంది". అని హెచ్చరించారు. బంగ్లాదేశ్ సౌర్వభౌమాధికారాన్ని, మానవహక్కులని గౌరవించని వారికి భారత్ ఆశ్రయం కల్పిస్తే బంగ్లాదేశ్ సమాధానమిస్తుందని తెలిపారు. 

అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ స్పందించారు. "ఈ వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైనవి, గతేడాది నుంచి తరచుగా ఈశాన్య రాష్ట్రాలని భారత్‌ నుంచి విడగొడతాం అని వ్యాఖ్యానిస్తున్నారు. భారత్‌ ఈ విషయంలో మౌనంగా ఉండకూడదు" అని హిమంత అన్నారు. భారత్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్. త్రిపుర రాష్ట్రాలను కలిపి సెవెన్‌సిస్టర్స్ అని అంటారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటుంది. గతేడాది ఆ దేశంలో జరిగిన ఘర్షణల తర్వాత హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందింది. అయితే కొద్దిరోజుల క్రితం హసీనాకు  బంగ్లాదేశ్‌లోని కోర్టులు 21 సంవత్సరాల జైలుశిక్షతో పాటు మరణశిక్ష విధించాయి. దీంతో షేక్ హసీనాను బంగ్లాకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌ను కోరింది. అయితే దీనిపై భారత్ ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం వెల్లడించలేదు.

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)