Breaking News

గ్లోబల్‌ జాబ్స్‌కు సెగ, ఎంట్రీ లెవల్‌ జాబ్స్‌ డేంజర్‌లో : IMF చీఫ్

Published on Fri, 02/20/2026 - 16:08

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఏఐ ఆధారిత సాంకేతికల వల్ల  ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులపై భారీ ప్రభావం పడుతుందని IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా (Kristalina Georgieva) హెచ్చరించారు.  ప్రపంచ శ్రామిక శక్తిలో 40 శాతం, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయని అంచనా వేశారు. ఈ మార్పు "కార్మిక మార్కెట్లకు సునామీ" లాంటిదనిఆమె అభివర్ణించారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి మద్దతుగల అధ్యయనాలను ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఈ సంఖ్య 60 శాతం వరకు పెరగవచ్చు కానీ భారతదేశానికి 26 శాతం వద్ద స్థిరపడే అవకాశం ఉందని ఆమె అన్నారు. సులభంగా ఆటోమేట్ చేయగల (యంత్రాల ద్వారా చేయగలిగే) పనులు, అంటే కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు చేసే ప్రారంభ స్థాయి ఉద్యోగాల విషయంలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్ AI ని సరిగ్గా వినియోగించుకుంటే, దేశ GDP ఏటా 0.7 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.అలాగే ప్రజలను AI ఆర్థిక వ్యవస్థకు సిద్ధం చేయడానికి ప్రభుత్వం సరైన విధానాలను (Policymaking) రూపొందించాలని, కేవలం నైపుణ్యాలు నేర్చుకోవడమే కాకుండా వాటిని మార్చుకునే సౌలభ్యం (Flexibility) ఉండాలని ఆమె సూచించారు.

ఇదీ చదవండి: జెఫ్రీ ఎప్‌స్టీన్‌ బాధితురాలి నోట సంచలన విషయాలు

ఇండియాపై ప్రశంసలు
పన్నులు, కార్మిక మార్కెట్లలో భారత్ చేపట్టిన సంస్కరణలు నిర్మాణాత్మక దేశాన్ని మరింత పోటీతత్వంతో మార్చాయని ఆమె ప్రశంసించారు. భారత బ్యాంకింగ్ , కార్పొరేట్ రంగాలు బలంగా ఉన్నాయని, ఇది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు. అమెరికా నేతృత్వంలోని 'పాక్స్ సిలికా' (Pax Silica) వంటి వ్యూహాత్మక కూటముల్లో భారత్ చేరడం వల్ల, గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది AI వల్ల కలిగే నష్టాల నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె వివరించారు. AI ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.  

ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్‌: షాకింగ్‌ విషయాలు వెల్లడి

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి