Breaking News

ఇజ్రాయెల్‌లో నినదించిన ప్రధాని మోదీ పిలుపు

Published on Tue, 02/03/2026 - 08:56

జెరూసలేం: పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరుతో ఒక మొక్క) కార్యక్రమం  ఇజ్రాయెల్‌లోనూ నినదించింది. ఇక్కడి మోషావ్ నెవాతిమ్ ప్రాంతంలో దాదాపు 300 మొక్కలను నాటి ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. యూదుల పర్యావరణ దినోత్సవమైన ‘తు బిష్వత్’ పండుగను పురస్కరించుకుని ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

భారత రాయబార కార్యాలయం, ‘కెరెన్ కైమెట్ లెయిజ్రాయెల్’, స్థానిక సంస్థల సహకారంతో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. వందలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం.. పర్యావరణంపై భారత్, ఇజ్రాయెల్ దేశాలకున్న నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఇజ్రాయెల్ పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ రామి రోజెన్, ఇజ్రాయెల్‌లో భారత రాయబారి జెపి సింగ్, బిన్నీ షిమోన్ ప్రాంతీయ మండలి అధిపతి నిర్ జమీర్ పాల్గొన్నారు.
 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి, ప్రకృతి సంరక్షణలో భారత్-ఇజ్రాయెల్ దేశాలు ఒకే బాటలో పయనిస్తున్నాయని కొనియాడారు. కేవలం సాంకేతిక రంగంలోనే కాకుండా, భూగోళాన్ని రక్షించే బాధ్యతలో కూడా ఇరు దేశాలు భాగస్వాములు కావడం గర్వకారణమని వారు అభిప్రాయపడ్డారు. భారత రాయబారి జెపి సింగ్ మాట్లాడుతూ ‘తు బిష్వత్’, ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. ఈ రెండూ ప్రకృతితో సమాజాన్ని  ఏకంచేసే గొప్ప సంప్రదాయాలు’ అని అన్నారు. నేడు నాటిన ఈ మొక్కలు రాబోయే తరాలకు భారత్-ఇజ్రాయెల్ స్నేహానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాతావరణ మార్పులు, పర్యావరణ రంగాలలో సహకారం అందుతోందని, ప్రకృతిని కాపాడుకోవడం అంటే జీవరాశిని కాపాడుకోవడమేనని ఇజ్రాయెల్ అధికారులు అన్నారు.  కాగా ఈ కార్యక్రమం జరిగిన ‘మోషావ్ నెవాతిమ్’ ప్రాంతానికి ఒక ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఇది కేరళలోని కొచ్చిన్ నుండి వలస వెళ్లిన భారతీయ యూదులచే స్థాపితమయ్యింది. ఇక్కడ కొచ్చిన్ శైలిలో నిర్మించిన ప్రార్థనా మందిరం (సినగోగ్), భారతీయ యూదుల వారసత్వ కేంద్రం నేటికీ భారతీయ సంస్కృతిని చాటిచెబుతున్నాయి.
 

ఇది కూడా చదవండి: ‘మెట్రో’లో చిల్లర చేష్టలు.. లక్షకు పైగా ఫిర్యాదులు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)