Breaking News

కశ్మీరీలతో ఇలాగేనా వ్యవహరించేది?

Published on Mon, 05/26/2025 - 00:36

మనలో చాలా మందికి పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి, ఆపరేషన్‌ సిందూర్, 4 రోజుల ‘యుద్ధం’ గురించి ఎక్కువగానే తెలుసు. తెలుసుకోవడం మనం ఒక పనిగా పెట్టుకున్నాం. కానీ ఈ కాలంలో జరిగిన ఇతర వాస్తవాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఏప్రిల్‌ 27, మే 8 మధ్య భారతదేశ వ్యాప్తంగా వివిధ రకాలుగా 184 ముస్లిం వ్యతిరేక దాడులు జరిగాయని పౌర హక్కుల రక్షణ సంఘం నివేదించింది. వాటిలో 19 విధ్వంసక చర్యలు, 39 దాడులు, 42 వేధింపుల సంఘటనలు, 84 ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలు ఉన్నాయి. వీటిలో 106 దాడులు పహల్‌గామ్‌ ద్వారా ‘ప్రేరేపితం’ అని అంచనా. వీటిలో ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలలో జరిగాయి.

కశ్మీరీలను, ఇతర ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడం సర్వసాధారణం కాబట్టి ఈ వాస్తవాలు మనకు తెలియలేదా? అవి మన అసహనం, నిరాశ, కోపానికి బాక్సింగ్‌ బ్యాగులుగా మారాయా? పత్రికలు వాటిని ఎందుకు నివేదించవు? వాటి గురించి తెలుసు కోవడానికి మనం ఎందుకు ప్రయత్నించడం లేదు?కశ్మీర్‌లో ఏమి జరిగిందో పరిశీలించండి. కేవలం అనుమానం ఆధారంగా, ఎటువంటి ప్రక్రియా లేకుండా, బుల్‌డోజర్‌ న్యాయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఉల్లంఘించి, ఉగ్రవాదులుగా చెప్పబడుతున్న వారి ఇళ్లను కూల్చివేశారు. చట్ట పాలనను అనుసరించే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం తనను తాను చెప్పు కోవడాన్ని ఇది అపహాస్యం చేయడం లేదా?

అంతే కాదు. బహుశా 2,000 మందిని అనుమానంతో అరెస్టు చేశారు. పాశ్చాత్య పత్రికలు వారిలో అనేక మందిని హింసించారని నివేదించాయి. ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ఇది కశ్మీరీలు, ముస్లింలు అనే కారణంగా కశ్మీరీ ముస్లింల పట్ల అనుమానాస్పద దృక్పథంతో వ్యవహరించడమేనని అనిపించడం లేదా?

కశ్మీరీలు ఎలా స్పందించారు?
ఇప్పుడు, కశ్మీరీలు పహల్‌గామ్‌ ఘటన పట్ల ఎలా స్పందించారో పోల్చి చూద్దాం. హోటల్‌ బుకింగ్‌లు లేని వారికి పడకలు అందించ డానికి మతాధికారులు మసీదులను తెరిచారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల నుండి ఛార్జీలు వసూలు చేయడానికి ట్యాక్సీ డ్రైవర్లు నిరాకరించారు. బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడా నికి దుకాణాలు, హోటళ్ళు, కళాశాలలు, పాఠశాలలు మూసివేయడంతో పూర్తి హర్తాళ్‌ జరిగింది. 

అధికారంలో ఉన్నా, లేదా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ ఉగ్రవాదులను ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించాయి. దీని గురించి మనకు వివరంగా తెలియాలి కానీ మనకు తెలియలేదు. లేదా దీని గురించి చాలా తక్కువగా చెప్పడం జరిగింది. ఎందుకు? కచ్చితంగా కశ్మీర్‌ నుండి మనం వినాలనుకున్న, వినవలసిన సందేశం ఇది కాదా?

లోయలోని కశ్మీరీల ప్రవర్తనకు పూర్తి విరుద్ధంగా, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలలో కశ్మీరీలను ఎలా చూశారో పరిశీలిద్దాం. పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో కశ్మీరీ విద్యార్థులను కొట్టారు. వారు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోవలసి వచ్చింది. ముస్సోరీలో, దశాబ్దాలుగా అక్కడ పనిచేస్తున్న‘షాల్‌ వాలాస్‌’ బల వంతంగా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ ఈ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కనిపించాయి. మళ్ళీ ప్రశ్నిస్తున్నాను... ఎందుకు? వీరు మీలాగే, నాలాగే హక్కులతో కూడిన భారత పౌరులు కాదా?

బహుశా, అన్నింటికంటే ఘోరంగా, అధికార స్థానాల్లో ఉన్నవారు కశ్మీరీలనూ, ముస్లింలనూ రక్షించడానికి బదులుగా దాడి చేయడాన్ని ఎంచుకున్నారు. ‘కశ్మీర్‌లో జరిగిన దాడి హిందువులపై జరిగిన దాడి. మేము కూడా అదే విధంగా స్పందిస్తాం. కశ్మీరీలపై మాత్రమే కాదు, భారతదేశంలోని ప్రతి ముస్లింపైనా’ అని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌ గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్‌ షా, కల్నల్‌ సోఫియా ఖురేషీని ‘ఉగ్రవాదుల సోదరి’ అన్నారు. అయినా వీరంతా తప్పించుకున్నారు. వారిని ఏ రకంగానూ హెచ్చరించలేదు. వారిని కచ్చితంగా శిక్షించలేదు.

ఇప్పుడు నేను రాసిన దాని గురించి ఆలోచించండి. ముస్లింలపై ప్రధానంగా దాడులు జరిగిన రాష్ట్రాలు ఏవి? అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి? ఏ పార్టీ సభ్యులు లేదా సైద్ధాంతిక మద్దతుదారులు అలా వ్యవహరించారో మీకే తెలుస్తుంది.అదేమీ రహస్యం కాదు. నిజానికి, ఇది కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది.

ఇదీ నాగరిక పద్ధతి!
దేశ విభజన తర్వాత హత్యలు తారస్థాయికి చేరుకున్నప్పుడు జవహర్‌లాల్‌ నెహ్రూ 1947 అక్టోబర్‌ 15న రాష్ట్ర ముఖ్యమంత్రులకు రాసిన లేఖ నుండి నన్ను ఉటంకించనివ్వండి: ‘మన దగ్గర ముస్లిం మైనారిటీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు కోరుకున్నా, వేరే చోటికి వెళ్లలేరు. వారు భారతదేశంలోనే నివసించాలి’. తరువాత స్పష్టంగా ఇలా జోడించారు: ‘పాకిస్తాన్‌ నుండి ఏదైనా రెచ్చగొట్టడం జరిగినా... మనం ఈ మైనారిటీతో నాగరిక పద్ధతిలో వ్యవహరించాలి.’

ఆ సలహా 80 సంవత్సరాల క్రితం ఉన్నంత సందర్భోచితంగానే ఇప్పుడు కూడా లేదా? మిస్టర్‌ మోదీ నుండి మనం వినవలసిన సందేశం ఇది కాదా? పైగా ప్రధానమంత్రి మౌనం వ్యూహాత్మక ప్రతిస్పందన అని చాలామంది విశ్వసిస్తున్నట్లయితే మనం ఎలాంటి దేశంగా మారాం?

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)