Breaking News

వలసలకు విఘాతం

Published on Tue, 01/28/2025 - 02:15

ప్రపంచ నలుమూలల నుంచీ లక్షల మంది యువతీ యువకులు అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంటారు. అక్కడ ఏదో ఒక పని దొరుకుతుంది.
మంచి వేతనాలు, మెరుగైన జీవితం అందుకోవచ్చన్న ఆశ వారిని అగ్రరాజ్యానికి ప్రయాణం కట్టిస్తోంది. కుదిరితే చట్టబద్ధంగా, లేదంటే ఆక్రమ మార్గంలోనైనా సరే అమెరికా వెళ్లేందుకు వారు సాహసిస్తున్నారు. మెక్సికో, ఎల్‌ సాల్వడోర్‌ ప్రజల తరువాత పెద్ద యెత్తున అనధికారికంగా అక్కడికి వెళ్తున్నది భారతీ యులే. 2021 నాటికే అమెరికాలో అలాంటి భారతీయుల సంఖ్య 7,25,000 మించిందని అంచనా. అక్కడి మొత్తం ఉద్యోగుల్లో 4.6 శాతం వరకు అనధికా రికంగా వచ్చినవారేనని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ లోగడ వెల్లడించింది.

వలసలే అభివృద్ధికి మూలం
సమాజ పరిణామం జాతుల, గణాల వలసల క్రమంలోనే జరిగిందని నిర్ధారిస్తారు తన ‘ఏన్షియంట్‌ సొసైటీ’ పుస్తకంలో ఆంత్రొపాలజిస్ట్‌ హెన్రీ మోర్గాన్‌. వలసలు ప్రపంచ వ్యాప్తంగా అనాది కాలం నుంచి జరుగుతూ వచ్చాయి. వలసలు ప్రపంచీకరణను, సరళీకరణను, ప్రైవేటీకరణను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా వలసదారుల వల్ల ఎంతో ఆర్థిక, సాంకేతిక, వైజ్ఞానిక ప్రగతిని పొందిందని చెప్పక తప్పదు. 

నిజానికి ట్రంప్‌ తండ్రి కూడా అమెరికాకు వలస వచ్చినవాడే! వలసల ప్రాధాన్యాన్ని గుర్తించని ఏ దేశమైనా కుదించుకుపోయే అవకాశం వుంది. ఏ నాగరి కత కూడా ఒంటరిగా అభివృద్ధి చెందదు. మతమూ, మౌలికమైన ప్రాపంచిక దృక్పథాల విషయంలో కూడా స్థానికమైన ఆలోచనా ధోరణులపై ఒక మేరకు బయటి ప్రభావాలు ఉంటాయి. ఆ విధంగా అవి మిశ్రమ నేపథ్యాలవుతాయి. 

అమెరికాను పాలించిన ఎంతోమంది మేధావులు ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాద భావాల్ని, వైజ్ఞానిక విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లినవాళ్లే. జాన్‌ డ్యూయి వంటి ప్రజాస్వామిక తత్వవేత్త ఆవిర్భవించిన నేల అది. అబ్రహాం లింకన్‌ ఎన్నో సామాజిక సంస్కరణలను తీసుకువచ్చారు. అమెరికాలో అభివృద్ధి చెందుతున్న ఎంతో విజ్ఞాన శాస్త్ర ప్రభావం ట్రంప్‌ మీద కనిపించటం లేదు.  

ఆది నుంచీ వివాదాస్పదుడే!
చర్చనీయాంశమైన అభిప్రాయాలు, ఉద్వేగభరితమైన ఉపన్యాసాలు, ఇబ్బందికర చేష్టలు, సంచలన ప్రకటనలు చేస్తూ ట్రంప్‌ గతంలో కూడా వార్తల్లో నిలిచారు. చొరబాటుదారులను నియంత్రించడానికి అమెరికా–మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి పూనుకున్నారు. విదేశాల నుండి అమెరికాకి వచ్చి పురుడు పోసుకున్నంత మాత్రాన పుట్టిన బిడ్డలు పౌరులుగా మారడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని కుండబద్దలు కొట్టారు. 

తాను అధ్యక్షుడైతే, అక్రమ వలసదారులను తన్ని తరిమేయటానికి ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. ఉగ్రవాదులు అమెరికాలోకి ప్రవేశించకుండా చూడాలంటే విదేశీ ముస్లింలందరినీ యూఎస్‌లోకి ప్రవేశించకుండా నిషేధించాలని ప్రతిపాదన పెట్టి విమర్శల పాలయ్యారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నో ఉన్నాయి ట్రంప్‌ జీవితంలో. అమెరికాతో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోలేకపోతే 51వ యూఎస్‌ రాష్ట్రంగా కెనడా కలిసిపోతుందని కూడా అన్నారు.

మేల్కోవాల్సిన సమయం
ఇదే క్రమంలో మనం కూడా అమెరికాపై మోజును తగ్గించుకోవలసి వుంది. మన మేధావులను, సాంకేతిక నిపుణులను మన దేశ అభివృద్ధికి ఉపయుక్తం చేసుకోవలసిన అవసరం ఉంది. నిజానికి మనకు మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. మన సంపదను పెంచుకున్నట్లయితే మనలో వలస భావన తగ్గుతుంది. 

ఇవాళ అమెరికా గురించి ఆందోళన చెందుతున్న మనం, మన దేశంలో రద్దవుతున్న రాష్ట్రాల హక్కుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు ఇతర దేశాలకు విద్య కోసం పరుగెడుతున్నారు. దీనికి కారణం విద్యా హక్కును మనం దెబ్బతీశాం. మన విశ్వవిద్యాలయాల్లో తగినన్ని సాంకేతిక పరికరాలు లేవు. విస్తృతమైన ల్యాబ్‌లు, గ్రంథాలయాలు లేక పోవడం వల్ల మన పిల్లలు వలస బాట పడుతున్నారు. 

ఇది భారతదేశం మేల్కోవలసిన సమయం. భయభ్రాంతులకు లోనుకాకుండా ఆత్మస్థైర్యంతో మనల్ని మనం పునర్నిర్మించుకోవలసి వుంది. మన పాలకులు అమెరికా నుండి తిరిగి వచ్చే విద్యార్థు లను, ఉద్యోగులను, స్కిల్‌ వర్కర్స్‌ను సాదరంగా స్వాగతించి, వారికి తగిన పనిని కల్పించడానికి పూనుకోవాలి. ట్రంప్‌ తన ఎన్నికల ప్రచారంలోనే ఈ విషయాలన్నీ చెబుతూ వచ్చారు. అప్పుడే మనం సిద్ధపడవలసి ఉంది. కానీ మనం ఉదాసీనత వహించి ఇప్పుడు ఆందోళన చెందుతున్నాం. 

కొన్ని సామాజిక తరగతులు భారతదేశంలో జీవించడానికి ఇష్టపడనంతగా దేశీయేతర భావాలు కలిగి ఉండటం ఆశ్చర్యం. ఇప్పుడు ఆ భావాల నుండి బయటపడాలి. దేశంలో కుటీర పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, విద్యాలయాలు, యూనివర్సిటీలు, పారిశ్రామిక కారిడార్లు నిర్మించుకోవలసి ఉంది. దేశీయ పారి శ్రామిక విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలని అంబేడ్కర్‌ చెప్పేవారు. 

ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో అనేకసార్లు వచ్చాయి. మనం ఈ పరిస్థితుల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రపంచంలో మానవులంతా ఏ దేశంలోనైనా జీవించవచ్చు, ఉపాధి పొందవచ్చు అనే ప్రపంచ పరిణామ సూత్రం మరోసారి చర్చలోకి వచ్చింది. మానవ జీవన వ్యవస్థల పునర్నిర్మాణానికి పూనుకోవలసిన సమయమిది.

డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)