అమెరికా–చైనాలు దగ్గరయ్యేనా?

Published on Thu, 12/26/2024 - 01:40

ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలూ, సైనిక శక్తులూ అయిన అమెరికా– చైనాల మధ్య సత్సంబంధాలు చోటు చేసుకోనున్నాయనే సూచనలు అభినందనీయం. ట్రంప్‌ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు. తాను మంచివనుకున్న, తనకు పేరు తెచ్చే పనులను చేస్తారు. అనుకోని పనులు చేయడం తన బలమని ట్రంప్‌ ప్రకటించు కున్నారు. అమెరికా– చైనాల పరస్పర సహకారంతో ప్రపంచ శాంతి సౌభాగ్యాలను సాధించవచ్చు.

‘చైనా అపాయం’ బూచితో అమెరికా... చైనా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఆంక్షలు విధి స్తోంది. చైనా ఉత్పత్తులపై ఎక్కువ పన్నులు విధిస్తోంది. చైనా వాణిజ్య కట్టడికి కూటములు కడుతోంది. చైనా పొరుగు దేశా లకు ఆయుధాలను అమ్ముతోంది. విదేశాల్లో దూకుడుగా వ్యవహరిస్తోందనీ, స్వదేశంలో అణచివేతకు పాల్పడుతోందనీ, రష్యా–ఉక్రెయిన్‌ సంఘర్షణలో రష్యాకు మద్దతు ఇస్తోందనీ చైనాపై అమెరికా ప్రచారం చేస్తోంది. 

ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ చైనా వ్యతిరేక వైఖరి ప్రదర్శించారు. అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్‌ విదేశీ విధాన అమలుకు ఎన్నుకున్న వ్యక్తులను బట్టి ఆయన చైనా వ్యతిరేకత తెలుస్తుంది. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాతీయ భద్రత సలహాదారు మైక్‌ వాల్జ్‌ దీనికి ఉదాహరణ. 

మరోవైపు ప్రపంచ ఘటనలు అంచనాలను తారు మారు చేస్తున్నాయి. సిరియాలో 5 దశాబ్దాల అల్‌ అసద్‌ కుటుంబ పాలన స్వల్ప ప్రతిఘటనతో కూలి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. అతి బలీయమైన రష్యా, ఎదుగు తున్న ఇరాన్‌ అసద్‌ను దశాబ్ద కాలంగా గట్టిగా సమర్థించాయి. 

అయినా పేర్లే తెలియని తిరుగుబాటుదార్ల వేటలో కేవలం 2 వారాల్లో అసద్‌ దేశం వదిలి పారిపోయాడు. దీని వెనుక అనేక కారణాలున్నాయి. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ దాడి; తర్వాత పాలస్తీనా, హమాస్, గాజా, వెస్ట్‌ బ్యాంక్‌లపై, లెబనాన్‌లో హెజ్‌ బొల్లాపై, వీరిని సమర్థించిన ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ అమానవీయ దాడులు; ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు, అమెరికా ఆధీన ఐక్య రాజ్యసమితి అశక్తత వాటిలో కొన్ని.

సిరియా ప్రభుత్వ పతనం తర్వాత 2 రోజుల్లో ఇజ్రా యెల్, సిరియా ఉన్నత స్థాయి సైనిక సంపదను, వాయు సేనను 80 శాతం ధ్వంసం చేసింది. క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఆయుధ కర్మాగారాలు, పరిశోధన కేంద్రాలు, రసాయనిక ఆయుధాలు నాశనమయ్యాయి. 

రష్యా–ఉక్రెయిన్‌ సంఘర్షణలో ఉత్తర కొరియా రష్యా వైపు జోక్యం, రష్యాకు చైనా మద్దతు (చైనా దీన్ని తిరస్కరించింది) ఐరోపాలో ఆందోళన కలిగించాయి. చైనా చౌక విద్యుత్‌ వాహనాలు తమ వాహన పరిశ్రమకు హానికరమని ఐరోపా భయం. తమ దేశాల ఉత్పత్తులపై ట్రంప్‌ విధించబోయే అధిక పన్నులపై అమెరికా మిత్రులైన ఐరోపా, ఆసియా దేశాలు బాధ పడుతున్నాయి. 

ట్రంప్‌ చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ను మెచ్చుకున్నారు. తాను యుద్ధాలను ప్రారంభించననీ, కొత్త ఒప్పందాలను ప్రేమి స్తాననీ గర్వంగా ప్రకటించారు. ట్రంప్‌ అధికారంలో అమె రికా, చైనా సంబంధాల మెరుగుకు ఇది శుభసూచకం. 2009 ఆర్థిక సంక్షోభం తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థలో స్వీయ ఉద్దీపన తగ్గింది. ప్రజల వినియోగాన్ని పెంచాలనీ, విదేశీ పెట్టుబడులకు అనుకూలత కల్పించాలనీ, గిరాకీని పెంచాలనీ చైనా గుర్తించింది. మార్కెట్‌ అనుకూల ఆర్థిక విధానాలను స్వీకరించింది. 

ప్రజలకు డబ్బు అందే విధంగా వడ్డీ తగ్గించింది. రియల్‌ ఎస్టేట్, స్టాక్‌ మార్కెట్ల స్థిరీకరణ పద్ధతులను పాటించింది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ప్రపంచ అభివృద్ధికి చోదకశక్తిగా పని చేస్తానంటోంది. ఇవి అమెరికా–చైనా సంబంధాల మెరుగు దలకు ప్రేరణ. 

సంగిరెడ్డి హనుమంత రెడ్డి
వ్యాసకర్త ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి ‘ 94902 04545

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)