Breaking News

యువత గొంతును విందాం!

Published on Sat, 10/31/2026 - 07:47

ప్రపంచవ్యాప్తంగా యువత నుంచి వ్యక్తమవుతున్న అసమ్మతి స్వరాలను, నిరసనలను అర్థం చేసుకోవాలంటే వారు జీవిస్తున్న సామాజిక వాస్తవికతను పరిశీలించాలి. జెన్‌ జడ్‌ ఉద్యమాలను తాత్కాలిక ఆవేశంగా కొట్టి పారేయడం ఎంత పొరపాటో, వారి ప్రతి వ్యక్తీకరణను విప్లవాత్మక చైతన్యంగా చూడటం కూడా అంతే పొరపాటు. వారి ప్రశ్నల్లోని అవకాశాలను, పరిమితులను గుర్తించడం అవసరం.

ఉపాధి పోటీకి విద్య ఎందుకు పరిమితమవుతోంది? అవకాశాలు కొందరికే ఎందుకు దక్కుతున్నాయి? సమానత్వం గురించి మాట్లాడే సమాజంలో కుల, వర్గ, లింగ వివక్షలు ఎందుకు కొనసాగుతున్నాయి? ప్రజాస్వామ్యంలో యువత గొంతుకు తగిన విలువ ఎందుకు దక్కడం లేదు? ఈ ప్రశ్నల వెనుక నిరుద్యోగం, ఆర్థిక అసమా నతలు, విద్య ప్రైవేటీకరణ, ప్రజాస్వామిక సంస్థలపై తగ్గుతున్న విశ్వాసం వంటి సమస్యలున్నాయి. ఒక దళిత విద్యార్థి ఎదుర్కొనే కుల అవమానానికి, ఆదివాసీ విద్యార్థి అనుభవించే సాంస్కృతిక దూరానికి, యువతి ఎదుర్కొనే వివక్షకు ప్రత్యేకమైన సామాజిక, చారిత్రక కారణాలున్నాయి. యువతను ఒకే ఆలోచనతో ఉన్న సమూహంగా చూడలేం.

సామాజిక మాధ్యమాలు యువతకు తమ అనుభ వాలను వ్యక్తం చేయడానికి, అధికారిక కథనాలను ప్రశ్నించడానికి కొత్త అవకాశాలను కల్పించాయి. ఈ ప్రయాణంలో సాహిత్యానికి కీలకమైన పాత్ర ఉంది. అణగారిన ప్రజల అనుభవాలకు సాహిత్యంలో స్థానం కల్పించడం అంటే కొత్త పాత్రలను పరిచయం చేయడం మాత్రమే కాదు, సమాజాన్ని చూసే దృష్టిని మార్చడం కూడా. యువ రచయితలకు వేదికలు కల్పించడంతోపాటు వారి రచనలను వినడానికి, చదవడానికి, విమర్శనాత్మకంగా చర్చించడానికి సాహిత్య ప్రపంచం సిద్ధపడాలి.

ఈ నేపథ్యంలో ‘సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం’ అక్టోబర్‌ 31న హైదరాబాద్‌లోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న రెండవ సమూహ యువ సాహిత్యోత్సవం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘గోడల్ని ఛేదిద్దాం’ అనే నినాదంతో యువతరం సాహిత్యం, విద్యార్థుల ఆకాంక్షలు, డిజిటల్‌ మాధ్యమాలు, ఆధిపత్య వ్యవస్థలు, ప్రదర్శన కళలు వంటి అంశాలపై చర్చకు వేదిక కల్పించడం ఆహ్వానించదగిన ప్రయత్నం. యువత అభిప్రాయాలతో ఏకీభవించకపోయినా వినడం, వాదనల్లోని బలాన్ని గుర్తించడం, అవసరమైతే మన ఆలోచన లను సవరించుకోవడం నిజమైన ప్రజాస్వామిక సంభాషణ.

గోడలు ఇటుకలతోనే నిర్మితమవ్వవు. అవి మన ఆలోచనల్లో, విద్యాసంస్థల్లో, సాంస్కృతిక వ్యవస్థల్లో, మనుషుల మధ్య సంబంధాల్లోనూ ఉంటాయి. వాటిని ఛేదించడానికి ఆవేశంతోపాటు వివేచన, ప్రశ్నించే స్వేచ్ఛతో పాటు బాధ్యత అవసరం. యువత భవిష్యత్తు గురించి మాట్లాడటమంటే వారు రేపు ఏం అవుతారో ఊహించడం మాత్రమే కాదు, ఈ రోజు ఎలాంటి సమాజంలో జీవిస్తున్నారో ప్రశ్నించడం కూడా!
– మెర్సీ మార్గరెట్‌, కవయిత్రి

ఇదీ చదవండి: చెబుతున్నదొకటి చేస్తున్నదొకటి!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)