Breaking News

102 ఏళ్ల డాక్టర్‌..ఇప్పటికీ వైద్య సేవలోనే..! చిరకాలం బతకాలంటే..

Published on Thu, 06/05/2025 - 14:18

ఎవ్వరైన రిటైర్మెంట్‌ ఏజ్‌ వరకు పనిచేస్తారు. ఆ తర్వాత పదవీవిరణ చేసి..రెస్ట్‌ తీసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఈ శతాధికుడు విరామం ఎరుగని వైద్యుడు. ఇప్పటికీ డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండొవ ప్రపంచకాలం నాటి ఈ వృద్ధ డాక్టర్‌ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ అంతకంతకు పురోగమిస్తున్నారు. యువకుడి మాదిరిగా చురుగ్గా అన్నిపనులు చురుగ్గా చేసుకుంటారాయన. అంతేగాదు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా బతకాలంటే ఆ పనులు చేయొద్దని సూచనలిస్తున్నారాయన.

అతడే. అమెరికాలో క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన న్యూరాలజిస్ట్‌  డాక్టర్‌ హోవార్డ్ టక్కర్‌. ఆయనకు 102 ఏళ్లు. ఇప్పటికీ డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తూ..ఎందరో వైద్య విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అంతేగాదు టక్కర్‌ అత్యంత వృద్ధ ప్రాక్టీస్ డాక్టర్‌(Worlds Oldest Practicing Doctor)గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కూడా దక్కించుకున్నాడు. 

1922లో జన్మించిన డాక్టర్‌ టక్కర్‌ మహా మాంద్యం, రెండో ప్రపంచ యుద్ధం, కోవిడ్-19 మహమ్మారితో సహా ఒక శతాబ్ద నాటి చారిత్రక సంక్షోభాలకు నిలువెత్తు సాక్ష్యం ఆయన. విశేషం ఏంటంటే..ఇప్పటివరకు పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు డాక్టర్‌ టక్కర్‌. తాను ఇంతవరకు ఎలాంటి భయానక వ్యాధులతో బాధపడలేదన్నారు. 

అయితే 80లలో మాత్రం మెడ సమస్యతో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డానని, అయితే సునాయాసంగా ఆ సమస్యను జయించానని చెప్పారు. తన జీవితానుభవంతో నేర్చుకున్న ఆ నాలుగు పాఠాలే తన దీర్ఘాయువు రహస్యంగా విశ్వసిస్తారాయన. అంతేగాదు పదవీవిరమణ గురించి కూడా అస్సలు ఆలోచించరట. ఎందుకంటే దీర్ఘాయువు ప్రధాన శత్రువే పదవీ విరమణ అని నొక్కి చెబుతున్నారాయన. మరి టక్కర్‌ దీర్ఘాయువు రహస్యం ఏంటో తెలుసుకుందాం..

👉 ఈ వృద్ధ డాక్టర్‌ తన జీవితాంతం వ్యాయామాన్ని స్కిప్‌ చేయలేదన్నారు. ఈత కొట్టడం దగ్గర నుంచి జాగింగ్‌, స్కీయింగ్‌, జిమ్‌​, ట్రెడ్‌మీల్‌ వరకు అన్నింటి ని చేస్తారట ఆయన.

👉 అలాగే ఉద్యోగానికి పదవీవిరమణ ఇవ్వొద్దు..ఏదో ఒక వ్యాపకంతో ఉండండి. చేయగలిగిన ఉద్యోగం ఏదో ఒకటి చేయండి అని అంటున్నారు. లేదంటే మెదడు పిచ్చి పిచ్చి ఆలోచనలతో పాడవ్వుతుందట. తద్వారా అనారోగ్యాల బారినపడతామట. 

👉 ఎల్లప్పుడూ పనిజీవితం, కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే ఎల్లప్పుడూ సానుకూలత, ఆశావాదానికే ప్రాముఖ్యత ఇవ్వండి. 

👉 భవిష్యత్తు గురించి చిత్తించకుండా చేసే పనిలో సంతోషాన్ని వెతకండి. అలాగే కుటుంబసభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడపండి. 

👉 ఈ వృద్ధ డాక్టర్‌​ వ్యక్తిగత జీవితానికి వస్తే..మానసిక నిపుణురాలైన సారా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు నలుగురు పిల్లలు, పదిమంది మనవరాళ్లు ఉన్నారు. అయితే ఇప్పటికీ తన భార్యతో గొడపడటం, ప్రేమించడం వంటివి చేస్తానన్నారు.

👉 చివరగా ప్రతిఒక్కరు తమ జీవిత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలన్నారు. ప్రతి ఉదయం సాధారణంగా సాగిపోకూడదన్నారు. అప్పుడే జీవితానికి సార్థకత ఉంటుందని చెప్పారు. 

👉 అలాగే ఆయన సాధ్యమైనంత వరకు స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్‌నెట్‌ని వినియోగిస్తారు. సోషల్‌ మీడియా స్టార్‌గా మాత్రం ఉండనున్నారు. ఎందుకంటే స్వానుభవాలే..గొప్ప పాఠాలనేది ఆయన అభిమతం. 

👉 వీటన్నింటి తోపాటు ధూమపానం, మద్యపానం సేవించొద్దని అన్నారు. తాను జీవితాంతం వాటి జోలికిపోలేదన్నారు. అలాగే మితంగానే ఆహారం తీసుకుంటానని చెప్పారు. 

👉 అంతేగాదు డాక్టర్‌ టక్కర్‌ "జీవితమే ప్రాణాంతక వ్యాధి , దానికి విరుగుడు జీవించడమే" అని చమత్కారంగా చెప్పారు. 

ఈ వృద్ధ డాక్టర్‌ మాములు గ్రేట్‌ కాదు. అద్భుతమైన జీవిత పాఠాలు, ఆరోగ్య విధానం గురించి బహు చక్కగా వివరించారు డాక్టర్‌ టక్కర్‌.  

(చదవండి: ఆక్సియమ్ స్పేస్ మిషన్‌లో ఈసారి సరస్వతి దేవి వాహనం..)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)