1, 2, 3 కేన్సర్‌ దాకా అవసరమా మిత్రమా!

Published on Fri, 05/30/2025 - 16:16

దేహం ఎంత ధృఢంగా ఉన్నా.. సిగరెట్, బీడీ అలవాటు ఉంటే చాలు పొగాకు దండయాత్రకు గేట్ తీసినట్టే. పొగాకుతో క్యాన్సర్ ఎలా వస్తుంది అనే విషయం చెప్పటానికి, తెలుసుకోవటానికి వైద్యం చదవనవసరం లేదన్న సంగతి అంతర్జాలం చెప్పకనే చెపుతుంది. ఈ మధ్య వచ్చిన మైదాన్ హిందీ సినిమాలో హీరో పాత్రలో అజయ్ దేవగన్ దేశానికి మెరికల్లాంటి ఆటగాళ్లను అందిస్తాడు. కానీ ధూమపానం అలవాటు ఉన్న ఓ కోచ్ పొగాకు, ధూమపానం అలవాటుకు ఎలా బలయ్యాడని ఆ సినిమా అంతర్లీనంగా చెప్పింది. అలాగే తెలుగు సినిమాకు అద్భుతం అనదగ్గ పాటలకు సాహిత్యాన్ని, సమ"కూర్చిన" రచయితలు, కవులు, కొందరు దర్శకులు కూడా ధూమపానం వల్లనే చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు.

ఒక్కటి చాలు అంటూ మెల్లిగా మొదలెట్టి  2, 3, 4 అలా రోజూ డబ్బా, ఇలా  పర్సు  ఖాళీ చేసుకున్న అభాగ్యులు ఉన్నారు. సిగరెట్, బీడీ తాగితే జబ్బు ఎలా చేస్తుంది అంటే.. దమ్ము కొట్టినపుడు సిగరెట్‌లో పొగాకుతో పెనవేసుకున్న రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి కణాల డీఎన్‌ఏను నాశనం చేసే పనిలో పడతాయి. సరళంగా చెప్పాలంటే ఓ వ్యక్తి జాతకాన్ని.. ధూమ‌పానికి ముందు, తర్వాత అని చెప్పొచ్చు.

అమ్మా, నాన్నలు ఇచ్చే పాకెట్ మనీతో గుట్టుగా సిగరెట్‌కు అలవాటయ్యే కుర్రాళ్లు లేకపోలేదు. జేబులో దండిగా పైసలున్నా సద్వినియోగం చేసే వారూ ఉన్నారు. కానీ దమ్ము కొట్టే ఒక్కరి వల్ల అతని స్నేహితులు ఆ అలవాటుకు "దగ్గర" అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అంతేగాక కొన్ని సినిమాల్లో కూడా హీరో దమ్ము కొడుతూ ఉండే సీన్లు సైతం యువతను అటువైపు మ‌ళ్లించే అవకాశాలు ఉన్నాయి. అందుకే పాఠశాలల్లో కూడా మాదక ద్రవ్య నిరోధ చర్యలు చేపట్టారు. "బాబు ఆ అలవాటు మంచిది కాదు మానేయ్" అని చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది.

సిగరెట్, బీడీ కాల్చినపుడు వాటి నుంచే వెలువడే రసాయనాలు ఉక్కు లాంటి కండరాల్ని తుప్పు పట్టించే పనిలో ఉంటాయి. పటిష్టమైన ఆరోగ్యం పునాదులను దారుణంగా దెబ్బ తీస్తాయి. కణాలు(సెల్స్) అడ్డగోలుగా పెరగడానికి కారకం అవుతాయి. తద్వారా కేన్సర్‌కు దారి తీస్తాయి. ఆరోగ్యంగా ఉన్న కణాల డిఎన్ఏను దెబ్బ తీస్తాయి. అంటే శరీరం ఆకృతి ఇచ్చే కణాలపై తీవ్ర‌ ప్రభావం చూపుతాయి. ఓ ఎత్తైన భవనానికి గట్టి పునాది ఎంత ముఖ్యమో, మనిషి ఆరోగ్యానికి కూడా కణాల ఆరోగ్యం అవశ్యం.

చదవండి: NDA శిక్షణ పూర్తిచేసుకున్న 17 మంది మహిళా క్యాడెట్లు

సిగరెట్, బీడీ అలవాటు వల్ల కణాల డీఎన్ఏను రూటు మార్చే పొగాకు ఉత్పత్తుల రసాయనాలు.. రోగ నిరోధక శక్తిని దారుణంగా దెబ్బ తీస్తాయి. దేహ పోరాట ప‌టిమ‌ను సమాధి చేస్తాయి. వెరసి కణాలపై రాక్షసంగా దండయాత్ర చేసి.. దేహాన్ని జబ్బులతో అష్ట దిగ్బంధనం చేసేస్తాయి. రొంపిలో దిగబడ్డ ప్రాణిలా.. ఊపిరి ఆడకుండా చేస్తాయి.

మరి ఊపిరి ఆడకుండా నరకం చూపించే పొగాకుతో దోస్తీ దేనికి?

ధూమ‌పానానికి దూరంగా ఉంటే ఆరోగ్యంతో పాటు ఐశ్వ‌ర్యం కూడా మన దగ్గరే ఉంటుంది.

- మాచన రఘునందన్
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత
తెలంగాణ‌ పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)