Breaking News

నీతా అంబానీయా మజాకా : ఆమె బ్యాగు ధరతో కారు కొనేయొచ్చట!

Published on Mon, 12/16/2024 - 16:33

మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం నిర్వహించిన మినీ వేలంలో  ముంబై ఇండియన్స్‌ ఓనర్‌ నీతా అంబానీ  తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నారు. సందర్భానికి తగ్గట్టు తన  డ్రెస్సింగ్‌  స్టైల్‌తో  అదరగొట్టడం మాత్రమే కాదు,  హై-ఎండ్ యాక్సెసరీలతో  స్పెషల్‌ లుక్‌లో  అందరి కళ్లను తనవైపు  తిప్పుకోవడంలో నీతా అంబానీ ముందుంటారు.  

తాజాగా  బెంగళూరులో నిర్వహించిన WPL 2025 మినీ వేలం ఈవెంట్‌లో మరోసారి  ఈ విషయాన్నే రుజువుచేశారు.  ముఖ్యంగా ఆమె చేతిలోని పింక్‌ బ్యాగ్‌ హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

నీతా అంబానీ  పవర్ లుక్!
ఈ వేలం కార్యక్రమం కోసం  నీతా అంబానీ   నీతా అంబానీ  పవర్‌లుక్‌లో అదర గొట్టారు.  ఈ బిజినెస్ ఐకాన్ పవర్ షోల్డర్‌లు, డబుల్ కాలర్స్‌తో కూడిన చిక్ పాస్టెల్ పింక్ బ్లేజర్‌ను ధరించారు. స్టైలిష్ డెనిమ్ బ్లేజర్‌కు జతగా విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించారు. అంతేనా డైమండ్ స్టడ్స్‌, హార్ట్‌ షేప్డ్‌ లాకెట్టు నెక్లెస్, తెల్లటి చేతి గడియారం , హై హీల్స్‌తో  తన స్టయిల్‌కి లగ్జరీ టచ్ ఇచ్చారు.

ఇదీ చదవండి:  ముంబై ఇండియన్స్‌ మహిళా టీం, యువ ప్రతిభకు ప్రాధాన్యం : నీతా


 పింక్‌ హ్యాండ్‌బ్యాగ్‌
ఈ ఔట్‌ఫిట్‌కు తగ్గట్టుగా పర్ఫెక్ట్ మ్యాచింగ్‌తో ధరించిన  పింక్ హ్యాండ్‌బ్యాగ్  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పింక్ అండ్‌  వైట్ గోయార్డిన్ కాన్వాస్, చెవ్రోచెస్ కాల్ఫ్‌స్కిన్ సైగాన్ స్ట్రక్చర్ ఉన్న ఈ వాచ్‌ ధరతో ఒక కారు కొనేయొచ్చంటే నమ్ముతారా?  ప్రఖ్యాత బ్రాండ్ గోయార్డ్  బ్రాండ్‌కు చెందిన  బ్యాగ్ ధర సుమారు  10 లక్షల(12వేల అమెరికా డాలర్లు) రూపాయలట.

కాగా మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం   రిలయన్స్‌ఫౌండేన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్  పటిష్టమైన టీంను సిద్ధం చేసింది.  WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో  కొత్తగా  నలుగురు మహిళా  క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ  సంతోషం వ్యక్తం చేశారు. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)