Breaking News

తనను తాను పెళ్లాడిన యువతి ఫస్ట్‌ యానివర్సరీ, అదిరిపోయే వీడియో వైరల్‌

Published on Sun, 06/11/2023 - 10:46

గుజరాత్ అమ్మాయి క్షమా బిందు గుర్తు​ందా.  వడోదరకు చెందిన క్షమా బిందు జూన్ 8, 2022 లో తనను తాను పెళ్లి చేసుకున్న యువతిగా సంచలనం రేపింది. పెళ్లి తరువాత సింగిల్‌గానే హనీమూన్‌ కి కూడా వెళ్లి ఎంజాయ్ చేసింది.  ఇపుడు తొలి వార్షికోత్సవం సందర్భంగా మరోసారి వార్తల్లోకి వచ్చింది.

ఫస్ట్‌ యానివర్సరీ  సందర్భాన్ని ఒక రేంజ్‌లో సెలబ్రేట్‌ చేసుకుంది.  దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఎవరి ఇష్టం వచ్చినట్టువారు, ఎవరి మనస్తత్వానికి తగినట్టు వాళ్లు కమెంట్‌ చేస్తున్నారు. 1.9 వేలకు పైగా లైక్‌లు, పలు కామెంట్‌లు వచ్చాయి. చాలా మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అభిమానాన్ని చాటుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.

హ్యాపీ యానివర్సరీ.. కంగ్రాట్స్‌ .. సో ప్రౌడ్‌ ఆఫ్‌ యూ  చాలా మంది విషెస్‌ అందిస్తున్నారు. అదే సమయంలో పంది బురదలో దొర్లి అదే  జీవితమని మురిసిపోతుంది.. అర్జంటుగా ఈమెకు చికిత్స అవసరం అంటూ నోరు పారేసుకుంటున్నారు. కానీ ఇవేమీ ఆమెను అస్సలు బాధించడంలేదు. ఈ రకమైన ట్రోలింగ్‌ గతంలో కూడా ఎదుర్కొంది.  మీరేమన్నా అనుకోండిరా బై.. నా జీవితం నా యిష్టం.. నాకు న‌చ్చిన‌న్ని రోజులు ఇలాగే ఒంట‌రిగానే హ్యాపీగా గడిపేస్తానంటోంది. తనకు నచ్చినట్టు జీవితాన్ని ఆస్వాదిస్తోంది. మరెవ్వరికీ హాని చేయకుండా..  కుడోస్‌   మై డియర్‌   అంటున్నారు నెటిజన్లు.

కాగా 25 ఏళ్ల  క్షమా బిందు దేశంలో తొలిస్వీయ వివాహం లేదా సోలోగామిగా నిలిచిన సంగతి తెలిసిందే. అంతకు ముందు  బ్రెజిల్‌కు చెందిన ఓ మోడ‌ల్‌కు 33 ఏళ్ల క్రిస్ గ‌లెరా. త‌న‌ను తాను పెళ్లి చేసుకున్న ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అంతేకాదు రూ. 4 కోట్లు ఎదురు క‌ట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటానన్న అర‌బ్ షేక్‌ను తోసి రాజంది. కొనుక్కోవడానికి, అమ్మడానికి తానేమీ ఆట వ‌స్తువును కాదని తనకు  న‌చ్చిన‌న్ని రోజులు ఇలాగే ఒంట‌రిగా గ‌డుపుతానంటూ క్రిస్ తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)