Breaking News

ఆ అలవాట్లతో 15 కిలోలు బరువు..! 5 ఏళ్ల పాటు అలానే..

Published on Fri, 07/17/2026 - 11:13

వెయిట్‌లాస్‌ జర్నీలో చాలామంది సునాయాసంగా బరువు తగ్గే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో విజయం సాధిస్తారు కూడా. అయితే ఆ బరువునే మెయింటైన్‌ చేయడం అతి పెద్ద సవాలు. మళ్లీ యథాస్థితికి రాకుండా..అంతే స్మార్ట్‌గా మెయింటైన్‌ చేయడమే అత్యంత ముఖ్యం అని అంటోంది ఇషితా లంబా అనే మహిళ. చాలామంది బరువు తగ్గగలరు అంతే..కొందరే దాన్ని నిలబెట్టుకోగలరు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌తో తన వెయిట్‌ లాస్‌ అనుభవాలను షేర్‌ చేసుకున్నారు. మరి అవేంటో చూసేద్దామా..!.

తాను ఎలాంటి క్రాష్‌డైట్‌లపై ఆధారపడకుండా నిలకడగా 20 వాస్తవిక అలవాట్లను పాటించి సునాయాసంగా 15 కిలోలు వరకు బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చారు. అయితే దాన్ని ఐదేళ్ల పాటు నిలకడగా నిలబెట్టుకున్నానని చెప్పారు. ఈ వెయిట్‌లాస్‌ జర్నీలో బరువు తగ్గడం పెద్ద సమస్య కాదని తగ్గిన బరువుని మెయింటైన్‌ చేయడమే అతిపెద్ద సవాలని పేర్కొంది. అందుకోసం తాను ఏం చేసిందో సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. అవేంటంటే..

అతిగా తిన్న తర్వాత పస్తులుండాల్సిన పనిలేదు..
ఒక్కోసారి ఎక్కువగా తినేస్తాం. దాంతో సాధారణంగా మరుసటి రోజు పస్తులుండే ప్రయత్నం చేస్తుంటారు. అయితే తాను అలా చేయనని, తన సాధారణ దినచర్యకు తిరిగి వచ్చేస్తానంటోంది. అంటే ఇదివరకటి సాధారణ ఆహారపు అలవాట్లను యథావిధిగా ఫాలో అయితే చాలు అని అంటోంది. అంతేగాదు తన ప్రతి భోజనం తర్వాత రెండు వేల అడుగులు వేస్తానని చెబుతోంది. 

కేలరీల పరిమితి కంటే ప్రోటీన్‌కు ప్రాముఖ్యతన ఇస్తానని నొక్కి చెప్పారు. సాధ్యమైనంత వరకు తక్కువ తినడం కంటే ప్రోటీన్‌ లక్ష్యాన్ని చేరుకోవడంపైనే ఫోకస్‌ పెడతానని తెలిపింది. అంతేగాదు తన శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు  1.2-1.6 గ్రాముల ప్రోటీన్‌ ఉండేలా చూసుకుంటానని అన్నారు. 

బరువులు ఎత్తడం, తగినంత నీరు తీసుకోవడం..
వ్యాయామం కోసం ఇషితా తాను వారానికి నాలుగు సార్లు బరువులు ఎత్తుతానని, వారానికి రెండుసార్లు కార్డియో చేస్తానని పంచుకున్నారు. దాంతోపాటు వాలుగా నడవడం, సైక్లింగ్‌ లేదా ఈత కొట్టడం వంటివి చేస్తానని అన్నారు. అలాగే రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. 

అలాగే రాత్రి భోజనం తర్వాత సోంపు నీరు కూడా తాగుతానని చెప్పింది. ఇఇ జీర్ణక్రియకు సహాయపడుతుందని, మంచి నిద్ర పట్టేలా చేస్తుందని వెల్లడించింది. అలాగే వ్యాయామం చేయాలని అనిపించని రోజున దానికి బదులుగా మ్యూజిక్‌ వింటూ వాక్‌ చేస్తుంటానని అన్నారామె.  

తాను ఇప్పటికీ పిజ్జా, డెజర్ట్‌లు, బర్గర్‌లు తింటానని, అయితే ప్రతిరోజూ కాదని చెప్పుకొచ్చింది. ఒకవేళ డ్రింక్‌ చేయాలనిపిస్తే ముందుగా భోజనం చేసి, చక్కెర కలిపిన వాటికి ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటానని చెప్పింది. 

అలాగే స్వీట్స్‌ తినాలనిపించినప్పుడూ ప్రోటీన్ బార్‌లు లేదా ఆరోగ్యకరమైన కుకీలను, ఉప్పగా తినాలనిపించినప్పుడు ఇంట్లో తయారుచేసిన వేయించిన మఖానాను తీసుకుంటానని చెప్పుకొచ్చింది. 

నిలకడగా దినచర్యను పాటించాలంటే..నచ్చిన ఆహారాలను తినడమే మంచిదని అంటోంది. ప్రయాణాలు చేసేటప్పడు నడుస్తానని, వీలైనప్పుడల్లా మెట్లు ఎక్కుతానని చెప్పుకొచ్చింది. ఒక్కోసారి వ్యాయామం చేసే తీరిక దొరక్కపోతే..కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేసేలా  చూస్తానని వెల్లడించింది. 

అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదుసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకుంటానని తెలిపింది. 

చివరగా బరువు తగ్గడం అంటే తీవ్రమైన డైటింగ్‌లు చేయడం కాదని..దీర్ఘకాలం పాటు కొనసాగించ గల అలవాట్లనే ఎంచుకుంటే ఈజీగా బరువు తగ్గగలరని అన్నారు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: మామ్‌ వెయిట్‌లాస్‌ స్టోరీ..! 103 కిలోలు నుంచి 71 కిలోలకు..)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)