Breaking News

ఆపరేషన్‌ మధ్యలో క్లారినెట్‌ వాయించిన మహిళ..! ఆశ్చర్యపోయిన వైద్యులు

Published on Thu, 10/23/2025 - 17:17

ఇటీవల బ్రెయిన్‌కి సర్జరీ మెలుకువగా ఉండగా చేసిన ఘటనలు చూశాం. కొందరూ పాటలు, సినిమాలు చూస్తూ చేయించుకున్నారు. అదంతా ఒక ఎత్తైతే. బ్రెయిన్‌ సర్జరీ చేస్తుండగా..మధ్యలో ఓ సంగీత వాయిద్యాన్ని వాయించింది ఒ​క మహిళ . వైద్యులు సైతం విస్తుపోయారు. దీని కారణంగా తమ సర్జరీ సక్సెస్‌ అనేది తక్షణమే నిర్థారించుకోగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. మరి ఆ ఆసక్తికర కథేంటో చకచక చదివేద్దామా..!.

లండన్‌లో చోటుచేసుకుంది ఈ అద్భుత ఘటన. లండన్‌లో క్రౌబేర్‌కు చెందిన 65 ఏళ్ల డెనిస్‌ బెకన్‌(Denise Bacon) గత కొన్నేళ్లుగా పార్కిన్సన్స్‌తో(Parkinsons disease) బాధపడుతోంది. రిటైర్డ్‌ స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ థెరపిస్ట్‌ అయినా ఆమె పార్కిన్సన్స్‌ నుంచి ఉపశమనం పొందేందుకు కింగ్స్‌ కాలేజ్‌ హాస్పిటల్‌లో డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ ఆపరేషన్‌ చేయించుకోవాలనుకున్నారు. 

ఆమెకు ఈ వ్యాధి 2014లో నిర్థారణ అయ్యింది. ఫలితంగా నడవడం, ఈత కొట్టడం, డ్యాన్స్‌ చేయడం వంటివి ఏమి చేయలేకపోయింది. ఐదేళ్ల నుంచి తను ఎంతో ఇష్టపడే గ్రిన్‌స్టెడ్ కచేరీ బ్యాండ్‌ ప్రదర్శనలో సైతం పాల్గొనడం మానేసిందామె. ఆ నేపథ్యంలో ఇలా బ్రెయిన్‌కి ఆపరేషన్‌ చేయించుకోవాలనుకుంది బేకన్‌. ఇది సుమారు నాలుగు గంటల ఆపరేషన్‌. అందులో భాగంగా ఆమె పుర్రెకి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తున్నారు వైద్యులు. 

అంతలో మధ్యలో ఆమె చేతి వేళ్లను సునాయాసంగా కదిలించగలగడేమ కాదు, ఆపరేషన్‌ చేస్తుండగా మధ్యలోనే క్లారినెట్‌ను అద్భుతంగా వాయించింది. దాన్ని చూసి వైద్యుల సైతం విస్తుపోయారు. బ్రెయిన్‌ సర్జరీలో భాగంగా ఎలక్ట్రోడ్లు సక్రియం చేస్తుండగా చేతులు కదులుతున్నట్లు గమనించి.. ఇలా వాయిద్యాని వాయించాలని భావించానంటోంది. దీని కారణంగా తమ సర్జరీ విజయవంతమని, ఆమె సమస్య నుంచి బయటపడి మెరుగ్గా ఉందని తక్షణమే నిర్థారించగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. 

అంతేగాదు ఆమె ఆ సాహసం చేయాలనుకోవడం చాలా ప్రశంసించదగ్గ విషయమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్‌ చేశారు వైద్యులు. నెటిజన్లు సైతం శస్త్రచికిత్స మధ్యలో క్లారినెట్ వాయించడం అంటే.. అది మాములు ధైర్యం కాదంటూ బెకాన్‌ని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: కూతురి డ్రీమ్‌, తండ్రి సంకల్పం..! ఆ నాణేల సంచి వెనుక ఇంత భావోద్వేగ కథనా..)

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)