15 నెల​ల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..

Published on Wed, 10/22/2025 - 11:47

అధిక బరువు తగ్గడం అతిపెద్ద సమస్య కాదు అని నిరూపిస్తున్నారు పలువురు. మెరుగైన ఫలితాలు రావాలంటే సరైన విధంగా, మంచి నిపుణుల సలహాల సూచనలు పాటించాలి. ఈ అధిక బరువుకి చెక్‌పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించేది కేవలం డైట్‌ మాత్రమే కాదు, వర్కౌట్లుదే అగ్రస్థానం. ఎందుకంటే శారీరక శ్రమతో ఫ్యాట్‌ని కరిగించడమే గాక బరువులో మార్పులు కూడా సంభవిస్తాయి. కొందరికి చేతులు, కాళ్లు, పిరుదులు బాగా లావుగా కనిపిస్తాయి. ఆ ప్రదేశాల్లోని కొలెస్ట్రాల్‌ తగ్గి..ఫ్లాట్‌గా అవ్వడమేగాక చెక్కిన శిల్పంలా ఆకృతి మారాలంటే ఈ వ్యాయామాలు తప్పనిసరి అంటోంది ఫిట్‌నెస్‌ కోచ్‌ సాచి పాయ్‌. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా చూద్దామా..!. 

టొరంటోకు చెందిన ఈ ఫిట్‌నెస్‌ కోచ్‌ సాచి పాయ్‌(Saachi Pai) జస్ట్‌ 15 నెలల్లో 40కిలోలు పైనే బరువు తగ్గింది. అంతలా బరువు తగ్గడంలో తనకు హెల్ప్‌ అయిన వ్యాయామాలు, ఆహారాలు గురించి సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది. 

బరువు తగ్గడంలో మార్పులు బాహ్యంగా కనిపించాలంటే..కాళ్లు, చేతులు, పిరుదుల సైజ్‌ తగ్గితేనే..బరువు తగ్గినట్లు తెలుస్తుంది. అందుకోసం ఈ ఐదు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయలంటోంది సాచి పాయ్‌. 

సైడ్ రైజెస్
ఈ వ్యాయామం కోసం నిటారుగా నిలబడి ప్రారంభించాలి. ఒక కాలును పక్కకు ఎత్తి, దానిని నిటారుగా ఉంచండి. కాలును నెమ్మదిగా క్రిందికి తీసుకురండి ..ఇలా పునరావృతం చేయాలి.

ముందు, వెనుక కిక్స్
ఎత్తుగా నిలబడి, ఒక కాలును ముందుకు తన్నండి, ప్రారంభానికి తిరిగి వెళ్లి, ఆపై దానిని వెనుకకు తన్నండి. ఆ తర్వాత యథాస్థానానికి వచ్చి..కదలికలను నియంత్రించాలి. ఇలా కొన్నిసార్లు రిపీట్‌ చేయండి. 

సింగిల్ ఇన్నర్ లెగ్ రైజెస్
మీ దిగువ కాలును నిటారుగా ఉంచి, పై కాలును దానిపై వంచి సైడ్‌కు పడుకోండి. ఇది, లోపలి తొడలపై ఒత్తిడి కలుగుజేసేలా దిగువ కాలును పైకి ఎత్తండి. ఇలా మీ కాలును నెమ్మదిగా తగ్గించి.. పునరావృతం చేయండి. నిర్దిష్ట సంఖ్యలో ప్రాక్టీస్‌ అయ్యాక..మరోవైపకి తిరిగి ఇలానే పునరావృతం చేయాలి..

ఫైర్ హైడ్రాంట్స్
నాలుగు కాళ్లపై ప్రారంభించండి, ఒక మోకాలిని పక్కకు ఎత్తండి, దానిని వంచి ఉంచండి. వ్యాయామం చేస్తున్నప్పుడు మీ తుంటిని తిప్పవద్దు. ఇప్పుడు, వీపును క్రిందికి తగ్గించి రెండో కాలికి ఇలానే వ్యాయామం రిపీట్‌ చేయండి.

డాంకీ కిక్స్
నాలుగు కాళ్లపై నిలబడి, ఒక మోకాలిని వంచి, మడమను పైకప్పు వైపుకు ఎత్తాలి. ఈ వ్యాయామాలు కొవ్వును కాల్చడానికి, టోన్ చేయడానికి హెల్ప్‌ అవుతాయి. పలితంగా శిల్పంలా శరీరాకృతి మారేందుకు దోహదపడుతుంది. 

ఈ వ్యాయామాలు నిపుణుల పర్యవేక్షణలో సరిగా చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారని, అదే తప్పుగా చేస్తే లేనిపోని శారీరక సమస్యలు తప్పవని చెప్పుకొచ్చారు. సాధ్యమైనంతవరకు నిపుణుడైన ఫిట్‌నోస్‌ పర్వవేక్షకుడి సమక్షంలో నేర్చుకోవడమే మంచిదని సూచిస్తున్నారు సాచిపాయ్‌.

 

(చదవండి: 44 కిలోల బరువు తగ్గిన ఫిట్‌నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్‌లాస్‌ పాఠాలు..)

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)