Breaking News

కలియుగ సుమతీ..150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకెళ్లి..!

Published on Mon, 07/21/2025 - 13:23

త్రేతాయుగంలో సతీ సుమతీ అనే మహా పతివ్రత గురించి వినే ఉంటారు. సుమతీ భర్త కౌశికుడు. కౌశికుడు ఎంత కోపిష్టివాడో.. అతని భార్య సుమతీ అంత శాంతమూర్తి. కౌశికుడు కుష్టురోగంతో బాధపడుతున్నప్పటికీ, సుమతీ అతనిని విడవకుండా సేవ చేస్తుంది. ఒకానొక సందర్భంలో.. ఆమె భర్తను భుజాలపై ఎక్కించుకుని వేశ్య ఇంటికి తీసుకెళ్తుండగా.. మాండవ్య ముని శాపం వల్ల సూర్యోదయానికి ముందే అతని శరీరం వెయ్యి ముక్కలుగా మారుతుందని తెలుసుకుంటుంది. అప్పుడు సుమతీ తన పతివ్రత్య శక్తితో సూర్యోదయాన్ని ఆపివేస్తుంది. తద్వారా భర్త ప్రాణాలు కాపాడుతుంది. చివరికి దేవతలు ఆమెను అభ్యర్థించి, కౌశికుడిని ఆరోగ్యవంతుడిగా చేస్తారు. ఆ సతీ సుమతీది త్రేతాయుగం అయితే మనం చెప్పుకోబోయే ఈ సతీ సుమతిది కలియుగం.

ఆమె భర్త దుర్మార్గుడు కాదు. కానీ కుష్ఠురోగంతో బాధపడుతున్న అతనిని చూసి, నేటి సుమతీ చేస్తున్న సేవలు, చూపిస్తున్న నిబద్ధత అంతా ఇంతా కాదు. ప్రస్తుతం భర్తను వీపుమీద మోసుకుంటూ వెళ్తున్న ఫొటోల్ని చూస్తున్న నెటిజన్లు.. ఈ కాలంలో ఇలాంటి భార్యలు ఉన్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా..ఆ మహాసాధ్వి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు

ఘజియాబాద్‌లోని మోడీనగర్‌లోని బఖర్వా నివాసితులు ఆశా, సచిన్‌ దంపతులు. శ్రావణ మాసంలో ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కన్వర్‌ యాత్రను చేస్తుంటారు. ఇది శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) జరుగుతుంది. ఈ సమయాన్ని శివుని ఆరాధనకు అత్యంత విశిష్టమైన కాలంగా భావిస్తారు. శివ భక్తుల తీర్థయాత్రనే కన్వర్‌ యాత్ర అంటారు. ఈ యాత్రలో భాగంగా భక్తులు హరిద్వార్, గంగోత్రి, రిషికేష్ వంటి ప్రాంతాల నుంచి గంగాజలాన్ని కావడిలో (కన్వర్) నింపుకుని తమ ప్రాంతాల్లోని శివాలయాలకు కాలినడకన తీసుకెళ్తారు. 

ఈ గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇక్కడ కన్వర్‌ అనేది వెదురు కర్ర, దానికి రెండు వైపులా నీటి కుండలు వేలాడేలా కట్టి భుజాలపై మోస్తారు కాబట్టి దీన్ని కన్వర్‌ యాత్ర అంటారు. ఇక్కడ ఆశా భర్త సచిన్‌ గత 13 ఏళ్లుగా కాలినడకనఈ యాత్ర చేస్తున్నాడు. అయితే గతేడాది వెన్నుకి గాయం కావడంతో పక్షవాతానికి గురయ్యాడు. దాంతో ఈ ఏడాది ఆ యాత్ర చేసే అవకాశం లేకుండాపోయింది. 

అయితే అతడి భార్య..అతడి నియమానికి ఆటంకం కలగకుండా అతడిని వీపుపై మోసుకుంటూ కన్వర్‌యాత్ర చేయ తలపెట్టింది. కూడా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆశా ఏకంగా 150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకుంటూ కాలినడకన యాత్ర పూర్తిచేసింది. ఆమె అపారమైన భక్తి, భర్తపై ఉన్న అచంచలమైన ప్రేమ చుట్టూ ఉన్న యాత్రికులను కూడా మంత్రముగ్దుల్ని చేశాయి. 

నిజంగా ఆ మహాతల్లి సాహసం స్ఫూర్తిని కలిగించడమే గాక ఎందరినో కదలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు కూడా స్వర్గంలో ముడివేసిన గొప్ప బంధం అంటే ఈ జంట కాబోలు అంటూ ఆ మహాతల్లి ఆశపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

(చదవండి: 58 ఏళ్ల నాటి తాతగారి బెంజ్‌కారు..! ఇప్పటికీ..)

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)