అడవుల్లో పెరిగే తెల్ల పుల్జేరు.. ఇన్ని ఉపయోగాలా?

Published on Fri, 10/23/2026 - 09:57

తెల్ల పుల్జేరును వైట్‌–బెర్రి బుష్, కామన్‌ బుష్‌ వీడ్‌ అని, హుమరి అని, థర్మకిరెల్‌ ΄్లాంట్, బుష్‌ వీడ్, కూల్‌ పాట హాని ష్రబ్‌ అని కూడా అంటారు.

ఉనికి..
తెల్ల పుల్జేరు ఒక ΄పొదలా, ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటుంది. ఆకులు రాల్చే గుణం కలిగినది. ఈ చెట్లు (΄పొదలు) ఎక్కువ ఉష్ణమండలం అడవుల్లో పెరుగుతుంటాయి. తెల్ల పుల్జేరు చెట్లు ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటాయి. ఎత్తు కూడా దాదాపు 3–5 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ చెట్లు అడవులు–మైదాన ప్రాంతాలు, ΄పొలాల గట్ల వెంబడి పెరుగుతుంటాయి. కాయలు ఆకుల సందుల్లో వరసగా కాస్తుంటాయి. కాయగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చగానే ఉండి పండు అయ్యే సరికి తెల్లగా గుండ్రంగా ఉంటాయి. పండ్లు బఠాని గింజంత వుంటాయి. వీటి స్వస్థలం ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా మొదలగు ఖండాలలోని కొన్ని ఉష్ణమండల దేశాలు. ఇండియాలో మాత్రం చాలా రాష్ట్రాల్లో వీటి ఉనికి ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లోని అడవులు, మైదాన ప్రాంతాల్లో కూడా పెరుగుతాయి.

వివిధ భాషల్లో తెల్లపుల్జేరు పండు పేర్లు
- ఇంగ్లీష్‌: స్నోబెర్రి 
- గుజరాతీ: హంర్రీ
- కన్నడ: బిలిసులిగిడ, సూలి, బెలాహులి, 
- గూడహలె, కండె కుదన, నెలమాసులి
- తమిళం: వెదుల, వెళ్ళెపూల, పులన్జీ, ఇరుబలై, పూల
- తెలుగు: తెల్లపురుగుడు, మేకరాయి, సూలముంత, తెల్లపులి, తెల్లపుల్జేరు
- మరాఠీ: కొడర్పి, పంధర్‌ ఫలి
- మలయాళం: పెరిన్కులవు, ముల్పులంజి, వెళ్ళముల్లరం
- హిందీ: సఫేద్‌ చైనార్, దమ్లే, పటలా, శినార్‌
- సంస్కృతం: నీలిషిల, భూరిఫలి, పండుఫలి, స్వేతకంచుజ

పూత..
ఏప్రిల్‌ – మే పండ్లు: ఆగస్టు – సెప్టెంబర్‌

ఉపయోగాలు..
తెల్ల పుల్జేరు ΄పొద చెట్టే అయినప్పటికీ, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటి లేత మండల కొసలను పశువులు, మేకలు తింటాయి. పండ్లు తియ్యగా ఉండి రుచిగా ఉంటాయి. పిల్లలు ఈ పండ్లను ఇష్టపడతారు. ఈ పండ్లను అన్ని ప్రాంతాల్లో ప్రజలు తింటారు. ఆకుల కషాయంతో పుండ్లను రెగ్యులర్‌గా శుభ్రపరిస్తే త్వరగా నయమవుతాయి. వీటి ఆకులు, ΄పొగాకుతో కషాయం చేసి మొక్కలపై పిచికారీ చేస్తే పురుగుల బెడద నుంచి కాపాడుకోవచ్చు.

ఇదీ చ‌ద‌వండి: ఈ పండ్ల‌లో విశేషంగా ఔష‌ధ గుణాలు

వీటి వేర్లు, పండ్లను విషపురుగుల కాటు ప్రభావాన్ని తగ్గించటానికి వాడతారు. ఈ చెట్ల వేర్లతో చేసిన మందులను సుఖరోగాలు తగ్గించటానికి సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు (carpus: 54028294). కీళ్ల నొప్పులు, దద్దుర్లు, మలేరియా జ్వరాన్ని తగ్గించటానికి దీని వేర్లతో చేసిన మందులను ఆయుర్వేదంలో వాడతారు. ఆఫ్రికా దేశాల్లో దేశవాళీ వైద్యరంగంలో ఈ చెట్టుకు మంచిప్రాధాన్యముంది.

ఇదీ చదవండి: మిద్దె తోటలో బేకింగ్‌ సోడా.. ఈ ప్రయోజనాలు తెలుసా?

చెట్ల బెరడులో ట్యానిన్లు, ఆల్కలైడ్స్‌ ఉండగం వలన తోళ్ళ పరిశ్రమలో, రంగుల అద్దకంలో (నల్లరంగు) వాడతారు. కలపను వంట చెరుకుగా వాడతారు. ఈ చెట్లలో ఉండే మూలకాలు అనేక విధాలుగా వైద్యానికి ఉపయోగ పడుతాయి. వీటి కొమ్మలను పండ్ల పుల్లగా వాడితే చిగుళ్ళు బలపడతాయి. దంత జబ్బులు తగ్గుతాయి. ఈ మొక్కలు విత్తనం ద్వారా ప్రవర్ధనం చెందుతాయి. ఈ పండ్ల వైవిధ్యాన్ని తెలుసుకొని పరిశోధనలు చేసి కొత్త రకాలకు నాంది పలికితే ఎంతో లాభసాటిగా ఉంటుంది.

English Name:
White Berry Bush/ Snow Berry

శాస్త్రీయ నామం:
Scientific Name: 
Antidesma ghaesembilla Gaertn.

Synonym (s): 
Antidesma diandrum Miq.
Antidesma dalbergioides Mull.Arg.

కుటుంబం: ఫిల్లంతేసి
Family: Phyllanthaceae   



- డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌. మొబైల్‌: 94407 08924

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)