Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..
Breaking News
నమ్మలేకున్నా..!ఇంత స్లిమ్‌గా మారానా..?
Published on Tue, 09/29/2026 - 17:16
వెయిట్‌లాస్ జర్నీని చాలా మంది ప్రారంభిస్తారు..కానీ కంటిన్యూగా నిలకగా చేసేవారే అరుదు. కానీ జస్ట్ రెండు మూడేళ్లు లేదా నెలలో ఆమె బరువు తగ్గలేదు. వ్యవధి పట్టినా..మార్పు మాత్రం నమ్మశక్యం కానీ విధంగా ఉండటం విశేషం. ఈ మహిళ వెయిట్‌లాస్ జర్నీ ఔత్సాహిక ఫిట్‌నెస్ వ్యక్తులకు ఓ గొప్ప సందేశాన్ని కూడా అందించింది. ఎవరా మహిళా..?, అంతలా ఎలా స్లిమ్‌గా మారిందో చూద్దామా..!.
డిజిటల్ క్రియేటర్ సిమ్రాన్ పూనియా సోషల్ మీడియా వేదిక తన వెయిట్‌లాస్ గురించి పంచుకుంది. తాను నిజంగా ఇంతలా సన్నగా మారతానని అనుకోలేదంటూ సంబరపడిపోతుంది. ఎందుకంటే ఆమె వెయిట్‌లాస్ జర్నీని ఎప్పుడో ప్రారంభించింది. నిలకడగా వర్కౌట్లు, సమతుల్య ఆహారం తీసుకుంటూ చేస్తూ పోయిందే తప్ప తనలోని మార్పుని అంతగా గమనించ లేదు. తాను బీచ్ వద్ద 2019లో వేసుకున్న అదే టీ షర్టు మరోసారి వేసుకోగానే ఆ మార్పుని గుర్తించింది. తాను చాలా బరువు తగ్గానని, తనలో ఇంత అనూహ్య మార్పుని చూసి ఆశ్చర్యంగా అనిపిస్తోందని అంటోందామె.
ఏదీఏమైనా..టైం పట్టినా..అనుకున్నది సాధించానని సంతోషంగా చెబుతోంది. తను ఏ 30 రోజులు లేదా నెలలు లేదా రెండు మూడేళ్లలో ఈ మార్పు తెచ్చుకోలేదు. కేవలం నిలకడ, ఓర్పుతో సాధించిన శారీరక మార్పు అని సగర్వంగా చెబుతోంది. అంతేగాదు బరువు నిర్వహణ అనేది దీర్ఘకాలిక ప్రక్రియ అని..నిలకడగా ఓపికతో చేస్తే..కచ్చితంగా పురోగతి సాధించగలమని సిమ్రాన్ వెయిట్‌లాస్ కథ చెబుతోంది.
తగ్గడం లేదనుకుంటూ టెన్షన్ పడే కంటే..చక్కటి ఆరోగ్యకరమైన శైలిని పాటించడాన్ని స్కిప్ చేయకుంటే ఫలితం తథ్యం అని చెబుతోంది సిమ్రాన్ వెయిట్‌లాస్ స్టోరీ. అలాగే సిమ్రాన్ బరువు తగ్గడంలో అత్యంత కీలకపాత్ర పోషించేది వ్యాయామాలేనని, ఆ విషయంలో కేర్‌పుల్‌గా ఉంటే కచ్చితంగా బరువు తగ్గుతారని తన కథే రుజువు అని అంటోంది. అలాగే తాను దీన్ని గుర్తించనంతగా బిజీ అయిపోవడంతో తాను అస్సలు గమనించలేదని చెబుతోంది.
అయితే తన బాడీలోని అనూహ్య మార్పుని మాత్రం అస్సలు మర్చిపోనంటూ ఉబ్బితబ్బిబవ్వుతోంది. సిమ్రాన్‌లాంటి శారీరక మార్పు అచంచలమైన ఓపికతో నిలకడగా చేయడం వల్లే సాధ్యమవుతుందని ఆమె వెయిట్‌లాస్ స్టోరీనే చెబుతోంది. అదే సమయంలో దీన్ని ఎవ్వరూ స్ఫూర్తిగా తీసుకోవద్దని..ఎందుకంటే అందరి శరీరాలు ఒకేలా ఉండవని గర్తించుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
అలాగే నిపుణులు, వైద్యులు సలహాలు సూచనలతోనే ముందుకు సాగాలని ప్రజలను కోరింది. అంతేగాదు బరువు తగ్గాలనుకుంటే మాత్రం..ఆరోగ్యకరమైన మార్పులు, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు కీలకం అని గ్రహించడని చెబుతోంది.
ఇదీ చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో ఐశ్వర్య రాయ్ స్టైలిష్ లుక్..హ్యాండ్ బ్యాగ్ అంత ఖరీదా..!)
Tags : 1