లోక్ సభలో పరువుపాయే.. TDP MLAల రాసలీలల వీడియోలపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్..
Breaking News
వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్‌నెస్ మంత్ర..
Published on Fri, 04/17/2026 - 12:04
ఇటీవల బరువు తగ్గడం ఆధునిక ట్రెండ్‌గా మారింది. అందరూ చక్కటి శరీరాకృతిలో యంగలుక్‌లో కనిపించడం కోసం రకరకాల డైటింగ్‌లు, వర్కౌట్లతో పాట్లుపడుతున్నారు. కానీ కొందరు సింపుల్ చిట్కాలతో అద్భుతంగా బరువు తగ్గి ఆశ్చర్యపరుస్తున్నారు. బరువు తగ్గిన చాలామంది ఎంతో కొంత వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేశామని చెప్పగా ఈ పిల్లల తల్లి మాత్రం అవేమి చేయకుండానే బరువు తగ్గానంటోంది. పైగా ఆరోగ్యకరమైన రీతీలోనే తగ్గానని చెబుతుండటం విశేషం. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.
ముంబైకి చెందిన పిల్లల తల్లి, కంటెంట్ క్రియేటర్ సురభి పిసల్ తన వెయిట్‌లాస్ జర్నీని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ప్రసవానంతరం గుర్తుపట్టలేనంతగా మారిపోయానని చెప్పుకొచ్చింది. మళ్లీ తనలా మార్పు కోసం నెమ్మదిగా బరువతగ్గే యత్నం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తాను వ్యాయామాలు చేయలేదని చెబుతోంది. తన జీవనశైలికి సరిపోయే విధంగా చిన్న, చిన్న స్థిరమైన మార్పులు మాత్రమే చేశానని అంటోంది. అయితే డెలివరీ తర్వాత పరిస్థితులు కాస్త కష్టంగా ఉన్నాయని, ఏ డైట్‌చేసినా కడుపు ఉబ్బరం, బరువు పెరడం వంటి సమస్యలతో ఇబ్బందిపడ్డట్లు వివరించారామె.
అప్పుడే తాను ఆపిల్ సైడ్ వెనిగర్‌ని ఉపయోగించటం ప్రారంభించానని అన్నారు. ఇది తన జీవక్రియను మెరుగుపరిచి, ఆకలి కోరికలను నియంత్రించడానికి సహాయపడిందని అంటోంది. అది క్రమంగా తన బరువులో మార్పులకు దారితీసింది. ఇంతకుమునుపు సరిపోని బట్టలు సరిపోవడంతో మానసికంగా కాస్తం స్థైర్యం రావడం మొదలైందని తెలిపింది. కేవలం బరువు తగ్గడం పైనే కాకుండా మొత్తం ఆరోగ్యంపై కూడా ఫోకస్ పెట్టానన్నారు. అందుకోసం ఏ చాశారో కూడా చెప్పారు.
నల్ల జీలకర్ర నూనె (ఖాళీ కడుపుతో): జీవక్రియను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానిక హెల్ప్ అవుతుందట.
బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ (బ్లాక్ కాఫీ + కొబ్బరి నూనె): ఇది తక్షణ శక్తిని అందిస్తుందట. పైగా కొబ్బరినూనెలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని కరిగిస్తుందట.
ఎల్డర్‌బెర్రీ పొడి: దీన్ని పెరుగుతో కలిపి తీసుకుంటే దీనిలోని యాంటీఆక్సిడెంట్లను మెరుగైన రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు మద్దతిస్తుందని చెప్పుకొచ్చారామె.
తాను తన ఆరోగ్యంపై దృష్టిపెట్టడంతో ఆటోమేటిగ్గా బరువు తగ్గిపోయానని అంటోంది. నిజం చెప్పాలంటే వెయిట్‌లాస్ దానంతట అది జరిపోయిందని చెబుతోంది ఈ న్యూ మామ్.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..)
Tags : 1