Breaking News

Weight Loss: తూచా తప్పకుండా ఈ ఏడు సూత్రాలు..!

Published on Tue, 02/10/2026 - 14:12

బరువు తగ్గడం అన్నది చాలామందికి అతిపెద్ద సమస్య. కానీ కొందరికి చాలా సింపుల్‌. అదికూడా నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండానే వెయిట్‌లాస్‌ అవుతారు. అలాగని, అధిక వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేయరు. సాధారణంగా రోజువారీగా చేసే సింపుల్‌ వ్యాయామాలు..కాస్త తెలిగా మంచి ఆహారం తీసుకుంటూ తగ్గుతారు.  ఇక్కడ ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా..తగిన ప్రోటీన్లు, విటమిన్లు అందేలా జాగ్రత్త వహిస్తే..ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా బరువు తగ్గేలా మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక్కడొక ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కూడా అదే నిరూపించాడు. రోజువారీ ఆహారాన్ని రుచికరంగా, ఆరోగ్యకరంగా మార్చుకుని..అవలీలగా 35 కిలోలు తగ్గి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు బరువు తగ్గాలంటే ఈ ఏడు చిట్కాలు తప్పకుండా ఫాలో అవ్వాలని అంటున్నాడు. అవేంటో చూద్దామా..!

ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అన్ష్‌ త్రిపాఠి కొలెస్ట్రాల్‌ తగ్గించే వాస్తవిక ఆహార నియమాలను షేర్‌ చేసుకున్నాడు. తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. బరువు తగ్గడంలో కన్ఫ్యూజన్‌కి గురికావొద్దని అంటున్నాడు. మన స్వచ్ఛమైన భారతీయ ఆహారంతోనే కొవ్వుని కరిగించేలా తీసుకుంటే చాలని చెబుతున్నాడు. 

ప్రధాన నియమం..
కొలెస్ట్రాల్‌ని తగ్గించే ఆహారాలే మన భోజనపు ప్లేట్‌లో ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్‌ వేటిలో ఉంది..? తగినన్ని కూరగాయలు తింటున్నామా?.. నూనె దగ్గర నుంచి కార్బోహైడ్రేట్స్‌ వరకు అన్ని నియంత్రణలో ఉన్నాయా..?  అని గమనించాలి. ఇక్కడ ఏది మిస్‌ అవ్వకూడదు. 

ఆహారంలో ఉండాల్సినవి..
తప్పనిసరిగా సగం కూరగాయల్లో  1/4 వంతు ప్రోటీన్‌,  1/4 కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడాలి.

ప్రోటీన్ తప్పనిసరి..
ఆహారంలో కొవ్వు నష్టాన్ని ప్రోటీన్ నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రోటీన్ తక్కువగా ఉంటే ఆకలి కోరికలు పెరుగుతాయి. ఫలితంగా శరీరంలో కండరాలను కోల్పోవడం ప్రారంభమవుతుంది. .

కూరగాయలు తప్పనిసరి..
ఆరోగ్యకరమైన ఆహారంలో అతి ముఖ్యమైన భాగం. ప్లేట్‌లో వండిన లేదా పచ్చిగా ఉన్న భోజనానికి కనీసం రెండు వేర్వేరు కూరగాయలు ఉండాలి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి

కార్బోహైడ్రేట్ నియంత్రణ నియమం
మన ఆహారంలో కార్బోహైడ్రేట్‌లను జోడించాలి కానీ మితంగా ఉండాలి. భోజనంలో 1 రోటీ లేదా 1 కప్పు బియ్యం ఉండేలా కేర్‌ తీసుకోవాలి. అవసరం అనుకుంటే వాటి స్థానంలో పోహా లేదా ఉప్మాతో కూడా మార్చుకోవచ్చు. 

కొవ్వు/నూనె నియమం
డైట్‌ విషయంలో చాలామంది ఫెయిలైదే ఇక్కడే అని అంటున్నాడు. మన భోజనంలో రెండు నుంచి మూడు స్పూన్లకు మించి నూనె ఉండకుండా చూసుకోవాలి. అప్పుడు ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుంది. కేలరీలు కూడా సమృద్ధిగా ఉంటాయి.

గుర్తించుకోవాల్సిన విషయాలు
శాఖాహారుల కోసం,  కొవ్వు తగ్గింపు ప్లేట్‌లో సగం ప్లేట్ సబ్జీ, 1 కటోరి పప్పు/పనీర్/టోఫు,  1 రోటీ లేదా చిన్న మొత్తం రైస్‌ ఉండాలి. శాఖాహారులకు కొవ్వు నష్టం కష్టంగా అనిపించిందంటే..ప్రోటీన్ తీసుకోవడం చాలా తక్కువగా ఉందని అర్థం.

అలాగే నాన్-వెజ్ ప్లేట్‌లో చికెన్/చేప/గుడ్లు ప్రధానంగా ఉంటాయి. ప్లేట్‌లో సగానికిపైగా కూరగాయలు ఉండాలి. సమతుల్యతను కాపాడుకోవడానికి కార్బ్ భాగం చిన్నగా ఉండాలి. భాగాలను నియంత్రించినప్పుడు మాత్రమే మాంసాహార ప్లేట్ కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.

అల్పాహారం ప్లేట్‌లలో తక్కువ కార్బోహైడ్రేట్‌లతో ప్రోటీన్ ఉండాలి, ద్రవ కేలరీలు ఉండకూడదు. అయితే డిన్నర్ లేదా లంచ్ ప్లేట్‌లో ప్రోటీన్ క్వాండిటీ తక్కువగా ఉంటే..ఎక్కువ కార్బోహైడ్రేట్‌లు ఉండవచ్చు.

చక్కెర పానీయాలు నివారించండి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వంటకాలను ఇతరులతో షేర్‌ చేసుకోండి. 

ఇలా గనుక ఆహారంలో మార్పులు చేసుకుని తూచా తప్పకుండా ఫాలో అయితే..ఇట్టే బరువు తగ్గుతారంటూ తన పోస్ట్‌ని ముగించాడు ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ త్రిపాఠి.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: ఉబర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్‌లో కోడింగ్‌..!)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)