Breaking News

జస్ట్‌ ఆరు నెలల్లో 32 కిలోలు..! యంగ్‌లుక్‌లో 48 ఏళ్ల వ్యక్తి..

Published on Tue, 04/14/2026 - 11:35

బరువు పెరగడం అనేది ముమ్మాటికి అధికంగా తినడం వల్ల మాత్రమే కాదు. ఉరుకుల పరుగుల జీవన విధానానికి తోడు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దాన్ని అధిగమించే క్రమంలో చెడు ఆహారపు అలవాట్లకు బానిస అవ్వడంతో అధిక బరువుకి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలానే ఇక్కడొక వ్యక్తి ఊబకాయం బారినపడి రోజువారీ పనులు చేసుకోలేక పలు అవస్థలు పడ్డాడు. కనీసం ఫ్లైట్‌ జర్నీ సైతం కష్టంగా మారింది. అక్కడ చైర్‌లు తన భారీకాయాని సరిపోక ఇబ్బందులు, వార్డ్‌రోబ్‌లో బట్టలన్నీ డబుల్‌ఎక్స్‌ఎల్‌ సైజులే. కనీసం తనకు నచ్చిన డ్రెస్‌ తనసైజులో దొరకక పడే కష్టాలతో విసుగెత్తిపోయాడు. చివరికి బరువు తగ్గి స్మార్ట్‌గా మారాలని గట్టిగా నిశ్చయించుకుని మరి ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా తగ్గిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అది కూడా ఆరు నెలల వ్యవధిలోనే ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గడం విశేషం. అదెలాగో ఆ వ్యక్తి మాటల్లోనే సవివరంగా చూద్దామా..!.

ఆ వ్యక్తే 48 ఏళ్ల డేవిడ్‌. అతడు ఆరు నెలల క్రితం సుమారు 128 కిలోల బరువు ఉండేవాడు. 48 ఏళ్ల వయసులో చాలా చురుకుగా ఉండేవాడు, చక్కగా వ్యాపారాన్ని రన్‌ చేసేవాడు. తన పిల్లల బాస్కెట్‌బాల్‌, సాకర్‌ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. కానీ అతడు తన ఆరోగ్యం పట్ల చాలా చాలా ఆసంతృప్తిగా ఉన్నాడు. రోజువారీ పరిస్థితులు ఒత్తిడితో కూడుకున్నవిగా మారాయి. ప్రయాణాలకు సామాన్లు సర్దుకోవడం ఒక పెద్ద పనిగా అనిపించేది. విమాన సీట్లు చాలా అసౌకర్యంగా ఉండేవి అతడికి. 

ఆఖరికి సరిగ్గా సరిపోయే బట్లలు దొరకడం ఓ సవాలుగా ఉండేది. దీనికి కారణం పని ఒత్తిడి. ఆ స్ట్రెస్‌ కారణంగా జంక్‌ఫుడ్‌కి బానిసయ్యాడు. అది కాస్తా అతడి రూపురేఖల్ని మార్చేసేలా అధిక బరువుకి దారితీసింది. ఇకలాభం లేదు ఇలా ఉంటే..రాను రాను తన కదలికలే భారంగా మారపోతాయేమో అనేంత భయం వేసింది. దాంతో బరువు తగ్గాలని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యి ఫిట్‌నెస్‌ కోచ్‌ కెవ్‌ని సంప్రదించాడు. అతడి మార్గదర్శంకలో సరైన జీవనశైలిని అవలంబించి కేవలం ఆరు నెలల్లోనే 32 కిలోలు తగ్గాడు. 

ఇంతకుముందు బట్టలు సర్దుకోవడం, జర్నీలకు వెళ్లడం ఎంత భారంగా ఫీలయ్యాడో..ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసంగా తేలిగ్గా చేసేస్తున్నాడు. అంతేగాదు కొలరాడోకు విమాన ప్రయాణంలో సౌకర్యవంతంగా వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు డేవిడ్‌. అంత సులభంగా, వేగవంతంగా బరువు ఎలా తగ్గాడో..తన వెయిట్‌లాస్‌ జర్నీ ఎలా సాగిందో అతడి ఫిట్‌నెస్‌ కోచ్‌ కెవ్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసుకున్నాడు. పైగా అతడు ఎలాంటి ఫుడ్‌ తీసుకునేవాడో కూడా వివరించాడు.

బరువు తగ్గేందుకు పాటించాల్సినవి..
స్థిరంగా బరువు తగ్గాలంటే..ప్రోటీన్ల కోసం ఆహారంలో చికెన్ బ్రెస్ట్, సిర్లోయిన్ స్టీక్, సాల్మన్, గుడ్లు, టర్కీ బేకన్, రొయ్యలు, గ్రీక్ యోగర్ట్, కాటేజ్ చీజ్ తదితరాలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ల కోసం తెల్లటి అన్నం, కెవ్‌ బ్రోకలీ, ఆస్పరాగస్‌, మిరపకాయలు, పాలకూర, పచ్చి బీన్స్‌ తదితరాలను సిఫార్సు చేస్తున్నారు. అంతేగాదు క్రియేటివ్‌ మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్‌ వంటి సంప్లిమెంట్లను కూడా జోడించినట్లు తెలిపారు కోచ్‌ కెవ్‌.

ఫుడ్‌ ప్లాన్‌..
ప్రణాళికతో కూడిన భోజనం, అది కూడా సమతుల్యం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

భోజనం 1: ప్రోటీన్ షేక్‌తో గ్రీక్ యోగర్ట్, లేదా టర్కీ బేకన్‌తో 3 గుడ్లు, లేదా అధిక ప్రోటీన్ యోగర్ట్‌తో కాటేజ్ చీజ్.

భోజనం 2:  అన్నం,  బ్రోకలీతో చికెన్, చిలగడదుంప, కూరగాయలతో మటన్‌, లేదా అన్నం, ఆకుకూరలతో సాల్మన్ ఉన్నాయి.

భోజనం 3:  బంగాళదుంపలు, ఆస్పరాగస్‌తో చికెన్‌ లేదా కాలీఫ్లవర్ రైస్ విత్‌  మిరపకాయలు, కూరగాయలతో రొయ్యలుతినమని కోచ్ కెవ్ సిఫార్సు చేసినట్లు తెలిపారు.

మెరుగైన ఫలితాల కోసం..
సత్వరమే మార్పులు పొందాలంటే సక్రమైన విధంగా దినచర్యను అనుసరించాల్సి ఉంటుంది.

  • ఉదయం 5:30 గంటలకు నిద్రలేచి, రాత్రి 10 గంటలకల్లా పడుకోవాలి.

  • మద్యపానానికి దూరంగా ఉండటం,  రాత్రి 7 గంటల తర్వాత తినడం ఆపడం

  • ప్రతిరోజూ కనీసం 8 వేల అడుగులు నడవాలి

  • వారానికి 3–4 సార్లు 45 నిమిషాల పాటు తీవ్రమైన శక్తి శిక్షణ వ్యాయామాలు చేయడం.

  • ఉదయం 30 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం, రెండుసార్లు బయట నడవడం

  • ప్రతిరోజూ కనీసం 150 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం

  • నీరు, ఎలక్ట్రోలైట్‌లతో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి

  • ప్రతిరోజూ 5 గ్రాముల క్రియేటిన్, నిద్రపోయే ముందు 400mg మెగ్నీషియం తీసుకోండి
    ఈ విధమైన దినచర్యతో ఆరు నెలల్లో 129 కిలోల నుంచి 96 కిలోలుకు చేరుకుని యువకుడి మాదిరిగా తన శరీరాకృతిని మార్చుకున్నాడు. సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత తొందరగా పరివర్తన వస్తుందనడానికి డేవిడ్‌ వెయిట్‌లాస్‌ స్టోరీనే ఉదాహరణ.

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: గొప్ప డాక్టర్‌ని అవ్వాలనుకున్నా..కానీ ఆ ఒక్క రీజన్‌..!)

 

 

 

 

Videos

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి

తండ్రి కొడుకులపై కుతకుత లాడిన అచ్చెన్నాయుడు

ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగ్..? ఆత్మహత్య చేసుకున్న శివ కార్తికేయ

దళిత మహిళపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రాజు

100 ఏళ్లలో ఎపుడు చూడని ఎండ, ఆ రెండు గంటలు బయటికి రాకండి

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ

ఊహించని దెబ్బ కొట్టిన బంగారం.. కొనాలనుకునే వారికి బిగ్ షాక్..

బోల్డ్ ఫోటోలు చూడాలంటే డబ్బులే! విష్ణుప్రియపై ఫిర్యాదుల వెల్లువ..?

తాడేపల్లి YSRCP ఆఫీస్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

Photos

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)