Breaking News

కండరాలు, గుండె పనితీరుకు ఆ విటమిన్‌ అత్యంత కీలకం..!

Published on Wed, 09/02/2026 - 10:43

ఎముకల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీరంలోని కండరాలు, గుండె పనితీరును మెరుగుపరచడంలో విటమిన్‌–డీ2 కంటే విటమిన్‌–డీ3 అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని హైదరాబాద్‌లోని ఐసీఎమ్‌ఆర్‌– జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) పరిశోధనలో తేలింది. ముఖ్యంగా శరీరంలో విటమిన్‌ లోపం ఉన్నప్పుడు, దాని నుంచి కోలుకునే ప్రక్రియలో విటమిన్‌–డీ3 కీలక పాత్ర పోషిస్తుందని మగ ఎలుకలపై జరిపిన ప్రయోగం ద్వారా స్పష్టమైంది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ సైన్స్‌ పత్రిక ‘మాలిక్యులర్‌ న్యూట్రిషన్‌ అండ్‌ ఫుడ్‌ రీసెర్చ్‌’లో ప్రచురితమయ్యాయి.

పరిశోధనలో ఏం తేలిందంటే.. 
కండరాల పుష్టి: విటమిన్‌–డీ2తో పోలిస్తే విటమిన్‌–డీ3 తీసుకున్న ఎలుకలలో కండరాల పరిమాణం, కండరాల పీచు పరిమాణం, పట్టుకునే బలం గణనీయంగా పెరిగాయి.

గుండె ఆరోగ్యం: గుండె కండరాల సంకోచవ్యాకోచాలు, గుండెకు సంబంధించిన జీవక్రియలలో విటమిన్‌–డీ3 అద్భుతమైన ఫలితాలను చూపించింది.

శక్తి జీవక్రియలు: కండరాలవృద్ధికి, శరీరంలో శక్తి ఉత్పత్తికి సంబంధించిన రసాయన ప్రక్రియలను విటమిన్‌–డీ3 వేగవంతం చేసింది.

పరిశోధన ఇలాగ
విటమిన్‌–డీ సాధారణంగా డీ–2, డీ–3 గా రెండు రూపాల్లో లభిస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాల కోసం ప్రయో­గశాలలో పెరుగుతున్న మగ ఎలుకల మీద ప్రయోగం చేశారు. ఒక సమూహానికి విటమిన్‌–డీ2, మరొక సమూహానికి విటమిన్‌–డీ3, ఇంకొక సమూహానికి రెండింటి మిశ్రమాన్ని, చివరి సమూహానికి విటమిన్‌–డీ లేని ఆహారాన్ని ఇచ్చారు.

గుండె నిర్మాణాన్ని రక్షించడంలో..
శరీరంలో కాల్షియం స్థాయిలను క్రమబద్ధీకరించడంలో ఈ రెండు విటమిన్లు సమానంగా పనిచేసినప్పటికీ, కండరాలు, గుండె నిర్మాణాన్ని రక్షించడంలో విటమిన్‌–డీ3 ఎంతో శక్తివంతమైనదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆయేషాఇస్మాయిల్‌ వివరించారు. 

భవిష్యత్తులో ప్రజలకు అందించే విటమిన్‌ అనుబంధ ఆహారాలు (సప్లిమెంట్లు), పౌష్టికాహార పెంపుదల (ఫోర్టిఫికేషన్‌) కార్యక్రమాలలో కీలక మార్పులకు ఈ ఫలితాలు ఉపయోగపడతాయని ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భారతి కులకర్ణి పేర్కొన్నారు. మానవులపై దీని ప్రభావాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరిన్ని విస్తృత పరిశోధనలు అవసరమని తెలిపారు.  

(చదవండి: ఆటిజం పిల్లలకు ప్రత్యేక చట్టాలున్నాయి!)

Videos

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

ఆపిల్ ల‌వ‌ర్స్‌కు గుడ్‌న్యూస్ ఐఫోన్ 18..కొత్త డేట్ ప్రీ బుకింగ్ ఆర్డ‌ర్ చేసుకోండి

భయపడకండి మీకు నేనున్నా... అంబటి సురేష్ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్

థియేటర్స్ దందాకు చెక్ Seat వద్దకే ఫుడ్ డెలివరీ..

నేపాల్ నీళ్ల పాలు.. ఊళ్లను ఊడ్చేసిన వరదలు

సర్కార్ పై గులాబీ సమరం

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)