ఇది కదా మహిళా శక్తి! 350 మంది మహిళల వీర గర్బా..

Published on Wed, 10/14/2026 - 18:05

నవరాత్రుల వేడుకల్లో నార్త్‌ ఇండియాలో దాండియా, గర్బా వంటి నృత్య ప్రదర్శనలతో కోలహాలంగా ఉంటాయి. అయితే ఈసారి ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ ఖండ్‌లో జరిగిన గర్భా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. వీరనారుల్లా మహిళలు చేసిన గర్బా నృత్య ప్రదర్శన భక్తిభావం తోపాటు చక్కటి సందేశాన్ని కూడా ఇవ్వడం విశేషం. మొత్తం 15 మంది మహిళలతో కూడిన 'మా చండికా ఉత్సవ్ సమితి' నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 350 మందిదాక మహిళలు, చిన్నారులు పాల్గొని కత్తులతో అద్భుతంగా గర్బా నృత్యం చేశారు. 

వాళ్లంతా భక్తిభావం, మహిళా సాధికారత, ఆత్మరక్షణ వంటి శక్తిమంతమైన సందేశాలతో నృత్య ప్రదర్శన ఇచ్చారు. సింపుల్‌గా చెప్పాలంటే రాణి లక్ష్మీబాయి ధైర్యసాహసాలను ప్రదర్శించారు ఆ నృత్యంలో.  ముఖ్యంగా కత్తిసాము ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మహిళలు తమ ప్రదర్శన ద్వారా స్త్రీత్వాన్ని ప్రదర్శిస్తూనే అనుచితన ప్రవర్తనను ఎదురించగలమని, అలాగే అవసరమైనప్పుడు తమను తాము రక్షించుకోగలమని బలమైన సందేశాన్ని ఇచ్చారు. 

అక్కడ వరుసగా తొమ్మిదో ఏట జరుగుతన్న ఈ గర్భా నృత్యం కోసం వాళ్లంతా పది రోజుల పాటు శిక్షణ తీసుకుని మరి పాల్గొనడం విశేషం. కాగా, పెద్దపెద్ద​ నగరాలకే పరిమితమైన ఈ నృత్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

 

ఇదీ చదవండి: ఒళ్లు గగుర్పొడిచే భక్తి విన్యాసం..! ఏకంగా 2,516 పదునైన మేకులపై పడుకుని..
 

Videos

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

బుద్ధిలేని గేమ్.. హౌస్ లో మరో బిగ్ ట్విస్ట్

Photos

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)

+5

రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. విరోష్ జంట క్యూట్‌ మూమెంట్స్ (ఫోటోలు)