చిన్నోడి డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు!

Published on Wed, 07/30/2025 - 19:37

పడవ స్పీడుగా దూసుకెళుతోంది.
ఆ స్పీడ్‌కు తగినట్లుగా దిఖా చేసిన మ్యాజిక్‌ డ్యాన్స్‌ సంచలనం సృష్టించింది. ఈ ఆన్‌లైన్‌ సంచలనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
పదకొండు సంవత్సరాల ఇండోనేషియా అబ్బాయి రెయాన్‌ అక్రన్‌ దిఖా చేసిన ఐకానిక్‌ బోట్‌ డ్యాన్స్‌ ‘ఆరా ఫార్మింగ్‌’ అంతర్జాతీయ స్థాయిలో వైరల్‌ అయింది. తాజాగా ఈ ట్రెండ్‌లో సింగపూర్‌ నేవీ సిబ్బందితో పాటు మన ముంబై పోలీసులు (Mumbai Police) కూడా భాగం అయ్యారు.

ముంబై పోలీసుల ఐకానిక్‌ బోట్‌ డ్యాన్స్‌ హిట్‌ కావడంతో, ఒరిజినల్‌ డ్యాన్స్‌ చూడని వాళ్లు ఇది చూసి ‘ఆహా’ ‘ఓహో’ అంటున్నారు.
ఉన్నతాధికారులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు ఈ ఐకానిక్‌ బోట్‌ డ్యాన్స్‌ ట్రెండ్‌లో భాగం కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్‌లో భాగం అవుతున్నవారు స్థానిక మ్యూజిక్‌ను వీడియోకు జత చేస్తున్నారు.
‘ఆరా ఫార్మింగ్‌’ అనేది ఇప్పుడు ఆన్‌లైన్‌లో పాపులర్‌ అయింది.  

కదులుతున్న కారుపై.. 
జ‌న‌మంతా చూస్తుండ‌గా కదులుతున్న కారుపై ముంబై మహిళ ఒక‌రు చేసిన ఆరా ఫార్మింగ్ డ్యాన్స్‌ వీడియో తెగ‌ వైరల్ అయింది. నవీ ముంబైలోని ఖార్ఘర్‌లో కదులుతున్న మెర్సిడెస్ బెంజ్ కారు బానెట్‌పై నజ్మీన్ సుల్దే అనే 24 ఏళ్ల మహిళ చెప్పులు లేకుండా డాన్స్ చేసిన వీడియో వైరల్ కావ‌డంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

చ‌ద‌వండి: రికార్డ్ బ్రేకింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌.. ఏకంగా 170 గంట‌ల పాటు.. 

నజ్మీన్‌తో పాటు కారు న‌డిపిన ఆమె ప్రియుడు అల్-ఫెష్ షేక్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. వారిద్ద‌రితో పాటు ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించినందుకు భారతీయ న్యాయ సంహిత, మోటారు వాహన చట్టం కింద వారిని అరెస్ట్ కూడా చేశారు. అల్-ఫెష్ షేక్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని వార్త‌లు కూడా వ‌చ్చాయి.

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)