Breaking News

వింటేజ్‌ క్రేజ్‌ : ఆమె ‘పద్మిని’ జాతి స్త్రీ... ఇంట్రస్టింగ్‌ స్టోరీ!

Published on Mon, 01/13/2025 - 13:02

నీకు ఇష్టమైన కారు ఏదో చెప్పు? అంటే క్రెటా అనో ఆడి అనో మెర్సిడెస్‌ అనో, బిఎండబ్ల్యూ అనో...ఇంకా మరికొన్ని అత్యాధునిక, ఖరీదైన లగ్జరీ కార్ల పేర్లు చెప్పేవాళ్లనే మనం  చూసి ఉంటాం కాబట్టి అదేమీ విశేషం కాదు. కానీ నీ కలల కారు గురించి చెప్పు అంటే ప్రీమియర్‌ పద్మిని అని ఎవరైనా చెబితే... కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు  స్పృహ తప్పినా ఆశ్చర్యం లేదు. అవును మరి ప్రీమియర్‌ పద్మిని అనే కార్‌ ఒకటి ఉండేదని, ఉందని కూడా చాలా మందికి తెలియని నవ నాగరిక ప్రపంచంలో... ఆ పురాతన కార్‌ కోసం  అన్వేషించి పట్టుకుని అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని  దానికి జవసత్వాలను సమకూర్చి.. తన పుట్టిన రోజున తనకు దక్కిన అపురూప బహుమతిగా మురిసిపోతూ ప్రపంచానికి పరిచయం చేయడం ఏదైతే ఉందో... అందుకే ఆ అమ్మాయి నెటిజన్ల ప్రశంసలకు నోచుకుంటోంది.

సొగసైన, హై–టెక్‌ కార్లు రోడ్లపై ఆధిపత్యం చెలాయించే కార్పొరేట్‌ ప్రపంచంలో, ఒక  బెంగళూరు ఐటీ ఉద్యోగిని  క్లాసిక్‌ కార్‌ ప్రీమియర్‌ పద్మినికి సరికొత్త యజమానిగా మారారు. భారతదేశంలో ఒకప్పుడు హుందాతనానికి అధునాతనతకు చిహ్నంగా కొంత కాలం పాటు హల్‌చల్‌ చేసిన ఈ కారు, గడిచిన విలాసవంతమైన యుగానికి ప్రాతినిధ్యం వహించింది అని చెప్పొచ్చు. అంతేకాదు రచన మహదిమనే అనే యువతి చిన్ననాటి జ్ఞాపకాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.ఆమె ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తాను కొనుగోలు చేసిన పాతకాలపు కారును, ఇంటికి తెచ్చుకున్న ఆనందాన్ని  తన అనుభవాన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియోలో పంచుకున్నారు.

 ఆమె తన ప్రియమైన ప్రీమియర్‌ పద్మిని  మహదిమనే తన చిన్ననాటి కలను జీవం పోస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. కొన్నేళ్ల తర్వాత తన కలల కారును ఎలా కనిపెట్టిందో ఆమె దీనిలో తెలియజేసింది. నెలల తరబడి ఖచ్చితమైన చేయించిన మరమ్మతులు అందమైన పౌడర్‌ బ్లూ పెయింట్‌ జాబ్‌ తరువాత, పాతకాలపు కారు ఎలా దాని పూర్వ వైభవానికి పూర్వపు అందానికి చేరుకుందో వివరించింది.

‘నాకు నేను పించింగ్‌ వేస్తున్నాను. నా పుట్టినరోజు కోసం నేను ఈ కారు కొన్నాను ఇది నా కలల కారు, నేను చిన్నప్పటి నుండి ఈ కారు గురించి కలలు కన్నాను‘ అని ఎమ్మెల్యే మహదిమనే వీడియోలో తెలిపారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఈ కార్‌తో ముడిపడి ఉండడం తో ఈ కార్‌ తనకొక భావోద్వేగ అనుబంధం అంటూ ఆ యువతి పొందుతున్న ఉద్వేగాన్ని ఇప్పుడు నెటిజనులు సైతం ఆస్వాదిస్తున్నారు.

‘‘గత ‘సంవత్సరాన్ని అత్యద్భుతంగా ముగించడం అంటే ఇదే ఇది ఇంతకంటే మెరుగ్గా ఏదైనా ఉండగలదా? నా డ్రీమ్‌ కారులో ఓపికగా పనిచేసి, దానిని ఈ అందానికి మార్చినందుకు  కార్‌ రిపేర్‌ చేసిన బృందానికి ధన్యవాదాలు’’ అంటూ ఆమె ఈ వీడియోలో చెప్పింది.

అత్యాధునిక ఖరీదైన కార్లు లేదా మరేదైనా సరే కొనుగోలు చేయడం అంటే మనం సాధించిన, అందుకున్న విజయ ఫలాలను నలుగురికీ ప్రదర్శించడమే కావచ్చు కానీ పాతవి, మరపురాని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, ఆ అనుభూతులను తిరిగి మన దరికి చేర్చుకోవడం మాత్రం ఖచ్చితంగా గొప్ప విజయమే అని చెప్పాలి. అలాంటి విజయాలను అందిస్తుంది కాబట్టే... వింటేజ్‌  ఇప్పటికీ కొందరికి క్రేజ్‌.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)