Breaking News

తినే ఆహారంలో వెరైటీలు ఉండేలా చూసుకోవాలి..! లేదంటే?

Published on Mon, 05/20/2024 - 13:45

జీవనశైలి అలవాట్లలో పెద్ద ఎత్తున వచ్చిన మార్పులతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మారిన, మారుతున్న ఆహార అలవాట్లతో ఎక్కువ మందిలో పోషకాహార లోపాలు, రక్తలేమి, ఇతర అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వినియోగం కూడా పెరగడంతో ఊబకాయం వంటి సమస్యలకు అనేక మంది గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్‌–హైదరాబాద్, ఎన్‌ఐఎన్‌ నిపుణుల కమిటీ ‘డైటరీ గైడ్‌లైన్స్‌ ఫర్‌ ఇండియన్స్‌’ పేరిట నిర్వహించిన అధ్యయనంలో పలు సూచనలు చేసింది. అన్ని వయసుల వారిలో ఆరోగ్య పరిరక్షణకు 17 డైటరీ గైడ్‌లైన్స్‌ సూచించింది. సమతుల ఆహారంలో వెరైటీలు (భిన్నరకాల ఆహార పదార్థాలు) ఉండేలా చూసుకోవడం ముఖ్యమని చెప్పింది.

ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఎన్‌ గైడ్‌లైన్స్‌లో ముఖ్యమైనవి..

  • మనం తీసుకునే ఆహారంలో తాజా కూరలు, పండ్లు, 50 శాతం ధాన్యం (సిరియల్స్‌) పోషకాలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. చిక్కుళ్లు, గింజలు, చేపలు, గుడ్లు వంటివి తీసుకోవాలి.

  • ఆరునెలల వయసు పైబడిన పిల్లలకు ఇళ్లలోనే తయారు చేసిన సెమీ–సాలిడ్‌ సప్లిమెంటరీ ఫుడ్‌ను ఇవ్వాలి.

  • చిన్నపిల్లలు, పెరిగే వయసున్న పిల్లలకు తగిన ఆహారం అందించి వారు అనారోగ్యం బారిన పడకుండా చూడాలి.

  • నూనె/కొవ్వుపదార్థాలు పరిమితంగా వాడాలి, తగినంతగా పోషకాలు, ఎసెన్షియల్‌ అమినో యాసిడ్స్‌ను వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా లభించేలా చూడాలి.

  • కండలు పెంచేందుకు ప్రొటీన్‌ సప్లిమెంట్స్‌ తీసుకోరాదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుని ఊబకాయం వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

  • కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్, చక్కె ర, ఉప్పు ఎక్కువ ఉన్న వాటిని నియంత్రించాలి.

  • శారీరకంగా చురుకుగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

  • శుభ్రమైన, సురక్షితమైన ఆహారాన్నే తీసుకోవాలి. మంచినీళ్లు తగినంతగా తాగాలి.

  • ప్రస్తుతం ఆహార పదార్థాలు ఎక్కువగా ప్యాకేజ్డ్‌ రూపంలో వస్తున్నందున ఆ ప్యాకెట్లపై ఉన్న వివరాలను పూర్తిగా చదివాకే కొనుగోలు చేయాలి.

  • గంటల తరబడి టీవీలు చూస్తున్నపుడు మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగాలి.

  • బిజీ షెడ్యూళ్లలో పనిచేస్తున్నా గంటకు ఒకసారైనా 5 నుంచి 10 నిమిషాలు నడవాలి.

ఇవి చదవండి: సోషల్‌​ మీడియా ట్రోలింగ్‌ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)