‘షట్‌డౌన్‌’ తెచ్చిన ఆహార సంక్షోభం

Published on Wed, 11/05/2025 - 14:31

ప్రస్తుతం అమెరికాలో ఆహార సంక్షోభం తలెత్తింది. ఈ మాట వినడానికే వింతగా ఉన్నా... వాస్తవం! అక్కడ ప్రస్తుతం ‘షట్‌డౌన్‌’ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షట్‌డౌన్‌ ప్రభావం అనేక రంగాలపై పడింది. తాజాగా వివిధ రాష్ట్రాలలో ఆహార సంక్షోభా నికి దారి తీసింది. ప్రధానంగా వాణిజ్య రాజధాని అయిన న్యూయా ర్క్‌పై పడింది. ఫెడరల్‌ ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆహార సాయం నిలిచిపోయింది. దీంతో ఆ రాష్ట్రం ‘స్టేట్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీ’ని  ప్రకటించింది. ఫెడరల్‌ ప్రభుత్వ షట్‌డౌన్‌ అమెరికాలోని కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన  ‘సప్లి మెంటల్‌ న్యూట్రిషన్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రామ్‌’ లేదా ‘ఫుడ్‌ స్టాంప్స్‌’  ప్రయోజనాలు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అమెరికాలో ఈ ప్రోగ్రామ్‌ ద్వారా దాదాపు నాలుగున్నర కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువమంది పేద వారే!

 ఇదిలా ఉంటే, నిధుల కొరత కారణంగా నవంబరు నెల ప్రయోజనా లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిలిపివేయాలని ఇటీవల రాష్ట్ర ఏజెన్సీ లను అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కాగా ఆహార సంక్షో భాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు లేదని గవర్నర్‌ కేథీ హోచుల్‌ ఆరోపించారు. చట్టబద్ధంగా ఆమోదించిన ఎమర్జెన్సీ ఫండ్‌ను విడుదల చేయడానికి ట్రంప్‌ సర్కార్‌ నిరాకరిస్తోందని కేథీ ఘాటు ఆరోపణలు చేశారు. ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అమెరికాలోని అనేక రాష్ట్రాలు సొంతంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ జాబితాలో లూసియానా, వెర్మంట్, న్యూ మెక్సికో ముందు వరుసలో ఉన్నాయి.

ఇదీ చదవండి : మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్‌ తొలి స్పందన

అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రతి ఏడాది తప్పనిసరిగా ఒక బడ్జెట్‌ను లేదా తాత్కాలిక ఖర్చులను అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే అక్టోబరు ఒకటో తేదీలోగా కాంగ్రెస్‌ ఈ బడ్జెట్‌ను ఆమోదించాల్సిఉంటుంది. అలా జరగకపోతే, ప్రభుత్వంలో అత్యవసరం కాని సేవలు తాత్కా లికంగా నిలిచిపోతాయి. దీనినే ‘ప్రభుత్వ షట్‌డౌన్‌’ అంటారు. వాస్తవానికి ప్రభుత్వ సొమ్ము వృ«థా కాకుండా చూడాలనే సదుద్దేశంతో షట్‌డౌన్‌ చట్టాన్ని తొలి రోజుల్లో తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము వృథా కాకుండా చూడాలనే నియమాన్ని అన్ని రాజకీయ పార్టీలూ పక్కన పెట్టి... తమ విధానపరమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి బడ్జెట్‌ ఆమోదాన్ని అడ్డుకుంటున్నాయి. అయితే సామాన్య అమెరికన్లు మధ్యలో నలిగి పోవడం గమనార్హం.
– ఎస్‌. అబ్దుల్‌ ఖాలిక్‌,  సీనియర్‌ జర్నలిస్ట్‌

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)