Breaking News

జలపాతం వద్ద రీల్స్‌ చేస్తూ కొట్టుకుపోయిన యంగ్‌ యూట్యూబర్‌

Published on Mon, 08/25/2025 - 12:49

సోషల్‌ మీడియా పిచ్చి, షేర్, లైక్స్‌ మోజులో పడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒడిశాకు చెందిన యువ యూట్యూబర్ సాహసం  విషాదకరంగా మారింది.   ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని కోరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతం ఈ  దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటన కెమెరాలో సంఘటన రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల​ అవుతోంది. ఈ సంఘటన  రీల్స్‌ కోసం,  సోషల్ మీడియా కంటెంట్ కోసం చేస్తున్న  ప్రమాదకర సాహసాలు, ప్రమాదాలపై చర్చలకు దారితీసింది.

తన యూట్యూబ్ ఛానెల్  కంటెంట్‌ కోసం జలపాతం అందాలను కెమెరాలో బంధించాలన్న ఉద్దేశంతో చివరికి ప్రాణాలే కోల్పోయిన ఘటన బాధిత  కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుడిని  గంజాం జిల్లాలోని బెర్హంపూర్‌కు చెందిన 22 ఏళ్ల సాగర్‌ (సాగర్ టుడు)గా గుర్తించారు. సాగర్, అతని స్నేహితుడు అభిజిత్ బెహెరాతో కలిసి, పర్యాటక ప్రదేశాల వీడియోలు చేసేందుకు  కోరాపుట్‌ వెళ్లాడు. అక్కడ మధ్యాహ్నం సాగర్ జలపాతం సమీపంలోని ఒక రాతిపై నిలబడి డ్రోన్ కెమెరాను ఉపయోగించి రీల్స్ తీస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అలామ్తాపుట్ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా మచ్చకుండ ఆనకట్ట అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు, దీనితో జలపాతం వద్ద నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. 

ఇక్కడ సాగర్‌ వీడియో రికార్డ్‌ చేస్తూ ప్రవాహా ధాటికి  ఒక రాతిపై చిక్కుకుపోయాడు. పర్యాటకులు ,స్థానికులు అతన్ని రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, నీటి వేగం ముందువారి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. తమ కళ్ల ముందే స్నేహితుడు కొట్టుకుపోవడంతో అతని ఫ్రెండ్స్ కన్నీటి పర్యంతమైనారు. మచకుండ పోలీసులు,అగ్నిమాపక దళం నుండి రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాలింపు చర్యలు చేపట్టాయి.సాగర్ ఆచూకీ కోసం  గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ వర్షాల తర్వాత ఆనకట్ట నుండి సుమారు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి ముందు మచకుండ అధికారులు దిగువన ఉన్న నివాసితులను అప్రమత్తం చేశారు

మరోవైపు  వర్షాకాలంలో ప్రమాదకరమైన సహజ ప్రదేశాలలో. పర్యాటకులు , కంటెంట్ సృష్టికర్తలు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని , జలపాతాలు మరియు ఆనకట్టల దగ్గర జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు

ఇదీ చదవండి: భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్‌ దానం.. కానీ ఇద్దరూ!

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు